ఆనందానికి.. తినేయండి

రోజంతా ఆనందంగా, ఉత్సాహంగా గడిపేయాలి... ఇంట్లోవాళ్లకీ సంతోషాన్ని పంచాలని కోరుకోని మహిళ ఉండదు. దానికి యోగా, థెరపీలంటూ ఎన్నెన్నో చేస్తాం కదా! కొన్నిరకాల ఆహార పదార్థాలూ ఆ మ్యాజిక్‌ చేస్తాయట.

Published : 15 Oct 2022 00:58 IST

రోజంతా ఆనందంగా, ఉత్సాహంగా గడిపేయాలి... ఇంట్లోవాళ్లకీ సంతోషాన్ని పంచాలని కోరుకోని మహిళ ఉండదు. దానికి యోగా, థెరపీలంటూ ఎన్నెన్నో చేస్తాం కదా! కొన్నిరకాల ఆహార పదార్థాలూ ఆ మ్యాజిక్‌ చేస్తాయట. అందుకే...

అరటి.. దీన్ని గుడ్‌ మూడ్‌ ఫుడ్‌ అంటారు. సంతోషం కలగడానికి కారణం సెరటోనిన్‌ అనే హార్మోన్‌. దీని విడుదలకు అవసరమైన బి6 విటమిన్‌ అరటిలో పుష్కలంగా ఉంటుంది. రోజులో శరీరానికి అవసరమయ్యే బి6 పరిమాణంలో 25 శాతం ఒక అరటి పండు నుంచే లభిస్తుందట. అందుకే రోజుకొకటైనా తినమంటారు పోషకాహార నిపుణులు. కొబ్బరి పాలలోనూ ఆందోళనను తగ్గించే పోషకాలుంటాయి. ఒత్తిడి, ఆందోళనగా అనిపించినప్పుడు ఓ చిన్న ముక్కను తిన్నా ఫలితం ఉంటుంది.

డార్క్‌ చాక్లెట్‌.. కోపంగా ఉన్న అమ్మాయికి ఒక్క చాక్లెట్‌ ఇచ్చి చూడండి. దెబ్బకు అది మటుమాయం అయిపోతుంది. చాక్లెట్లకీ మనకీ అంత దోస్తీ. తీపి అనే కాదు కానీ నిజంగానే దీనిలో భావోద్వేగాలపై ప్రభావం చూపే పదార్థాలుంటాయి. ఇందులోని అమైనో యాసిడ్‌లు సెరటోనిన్‌ ఉత్పత్తికి సాయపడతాయి. థియోబ్రొమైన్‌ భావోద్వేగాల మీద ప్రభావం చూపుతుంది.

కాఫీ.. ప్రపంచం మొత్తంలో దీన్ని ఇష్టపడే వారి సంఖ్య వంద కోట్లకుపైనే! ఏమాత్రం చిరాకు అనిపించినా వీళ్లంతా కాఫీ తాగడానికి ఇష్టపడతారట. రోజులో మూడు సార్లు మించకుండా తీసుకుంటే డిప్రెషన్‌కీ చెక్‌ పెట్టొచ్చని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

అవకాడో.. ఈ కాయంతా పోషకాలే. దీనిలోని కోలైన్‌ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి మనసును తేలిక పరుస్తుంది. దీన్లోని ఆరోగ్యకర కొవ్వులు మహిళల్లో ఆందోళనను తగ్గిస్తాయని ఓ పరిశోధన చెబుతోంది. పెద్ద మొత్తంలో ఉండే విటమిన్‌ బి ఒత్తిడినీ తగ్గిస్తుంది.

పులిసిన పదార్థాలు.. ఇడ్లీ, దోశ, పెరుగు, ఆవకాయ.. వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికీ తద్వారా మనసును తేలిక పరచడానికీ ఇవి సాయపడతాయట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్