అర్థం చేసుకుంటేనే ఆనందం

ఆలుమగల మధ్య పొరపొచ్చాలకు, తగాదాలకు సర్దుబాట్లే పరిష్కారం అనుకుంటారు చాలామంది. అయితే దానికంటే ముందు ఇద్దరి మధ్య స్పష్టత అవసరం.

Published : 17 Oct 2022 00:28 IST

ఆలుమగల మధ్య పొరపొచ్చాలకు, తగాదాలకు సర్దుబాట్లే పరిష్కారం అనుకుంటారు చాలామంది. అయితే దానికంటే ముందు ఇద్దరి మధ్య స్పష్టత అవసరం.

* మీ భాగస్వామి ఆలోచనా విధానం మీకు తెలుసా! లేకపోతే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఏ ఒక్కరూ ఒకేలా ఆలోచించలేకపోవచ్చు. ఇద్దరూ ఒకరికొరు అర్థమయితేనే, ఒకరికోసం ఒకరు ఆలోచించుకునే సమయం చిక్కుతుంది. అలా కాకుండా అవతలివారు మనల్ని అర్థం చేసుకోవాలనుకోవడం, మీ మనసు తెలుసుకుని మెలగాలనుకోవడం సరికాదు. ః కొత్తలో ఆలుమగలు ఎవరికి వారు అవతలి వారి నుంచి మంచి మార్కులు కొట్టేయాలనుకుంటారు. అందుకోసం తమ బలాల్ని మాత్రమే చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఆ తరవాత మీ మధ్య పొరపొచ్ఛాలకు కారణం అవుతుంది. మొదట్నుంచీ మీరు మీలానే ఉండండి. మీరేంటో అవతలివారికి అర్థమయ్యేలా వివరించడి. ఆ స్పష్టతే మీ బంధాన్ని బలపరుస్తుంది.

* చిన్న విషయమే కదా! ప్రతిదీ విడమర్చి చెప్పాలా! నాకు హక్కులేదా! అన్నింటికీ అనుమతి అవసరమా! అంటూ బోలెడు ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. మీ భావోద్వేగాలు నిజమే కావొచ్చు. కానీ ఒకరికొకరుగా బతుకుతున్నప్పుడు అది అనుమతి కాదు. వారిని నిర్లక్ష్యం చేస్తారేమోనన్న అభద్రతా భావం కావొచ్చు. అందుకే విషయం ఏ స్థాయిదైనా ఓ మాట వారి చెవిన పడేయండి. ఇది ఆ భావనను వారి నుంచి దూరం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని