అంత అసహనం వద్దు

తల్లిదండ్రులుగా మనం ఎంత తీరిక లేకున్నా.. పిల్లల కోసం ఎంతోకొంత సమయం కేటాయించాలి. లేకపోతే అది వాళ్ల భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి పరిశోధనలు. ఆఫీసు పనులూ, ఇంటిపనులకు సంబంధించిన ఆందోళనలూ, చిర్రు బుర్రలూ.. ఏవైనా సరే వాటి ప్రభావం మీపై లేకుండా చూసుకోండి.

Published : 24 Oct 2022 00:26 IST

తల్లిదండ్రులుగా మనం ఎంత తీరిక లేకున్నా.. పిల్లల కోసం ఎంతోకొంత సమయం కేటాయించాలి. లేకపోతే అది వాళ్ల భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి పరిశోధనలు.

ఆఫీసు పనులూ, ఇంటిపనులకు సంబంధించిన ఆందోళనలూ, చిర్రు బుర్రలూ.. ఏవైనా సరే వాటి ప్రభావం మీపై లేకుండా చూసుకోండి. ఎందుకంటే రోజులో మిగతా వేళల్లో కంటే ఉదయంపూటే మనం పిల్లలపై ఎక్కువగా చిరాకు చూపిస్తుంటామట.  పనిని ప్రణాళికాబద్ధంగా చేయడమే కాదు... పిల్లలూ వారి పనులు వారు పూర్తి చేసుకునేలా చేస్తే ఈ అసహనాన్ని అదుపు చేసుకోగలరు.

పెద్దలకే కాదు పిల్లలకూ మానసిక ఆందోళనలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంది పిల్లలు తమ ప్రతికూల ఆలోచనల్ని మాటల్లో చెప్పలేరు. బదులుగా ఎప్పుడూ విచారంగా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, తరచూ భయపడటం, ప్రతి దానికీ పేచీలు పెట్టడం వంటివి చేస్తుంటారు. అసలు సమస్యను అర్థం చేసుకోకుండా వారిని విసుక్కోవడం, లేదంటే పట్టించుకోకపోవడం చేయొద్దు. ముందు కాస్త సమయం కేటాయించి... వారితో అనునయంగా మాట్లాడండి. ఏ ఇబ్బంది వచ్చినా మీతో చెప్పుకునే ధైర్యాన్నివ్వండి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఒత్తిడినీ తగ్గిస్తుంది.

పిల్లలన్నాక అల్లరి చేయక మానరు. అలాగని మితిమీరి చేస్తుంటే అదుపు చేయాల్సిందే. కొడితేనో, తిడితేనో వారు మాట వింటారు అనుకుంటే పొరపాటు. అల్లరి చేసే సమయాన్ని నియంత్రిస్తూ... వారిని వివిధ పనుల్లో నిమగ్నమయ్యేలా చేయండి. కొత్త కొత్త హాబీలను అలవాటు చేసుకునేలా ప్రోత్సహించండి. క్రమంగా మీ మాట వింటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్