చర్చించొద్దు.. సాధించండి

పెద్ద ఎంఎన్‌సీ కొలువు, మంచి జీతం. మార్కెటింగ్‌ రంగంలో 9-5 గం. ఉద్యోగం! కానీ పాప పుట్టాక ఉద్యోగ జీవితంలో సాగలేననుకున్నా. తనతో ఎక్కువ సమయం గడపాలి,  నేను అన్ని వేళలా అందుబాటులో ఉండాలంటే ఉద్యోగంతో సాధ్యపడదు.

Published : 28 Oct 2022 00:34 IST

అనుభవ పాఠాలు

పెద్ద ఎంఎన్‌సీ కొలువు, మంచి జీతం. మార్కెటింగ్‌ రంగంలో 9-5 గం. ఉద్యోగం! కానీ పాప పుట్టాక ఉద్యోగ జీవితంలో సాగలేననుకున్నా. తనతో ఎక్కువ సమయం గడపాలి,  నేను అన్ని వేళలా అందుబాటులో ఉండాలంటే ఉద్యోగంతో సాధ్యపడదు. అలాగని కెరియర్‌ పక్కన పెట్టడమే మార్గమవకూడదు. కాబట్టి, ఇంకేదైనా చేయాలనుకున్నా. ఎక్కడికెళ్లినా గృహాలంకరణ వస్తువులను కొనడం నా అలవాటు. దాన్నే వ్యాపారంగా మలిస్తే అన్న ఆలోచన వచ్చింది. బాగా పరిశోధన చేసి ‘చంబక్‌’ ప్రారంభించా. పెట్టుబడి కోసం ఉంటున్న ఇంటినీ అమ్మేశా. ఉద్యోగం మానేసినపుడు మామూలే అనుకున్న వాళ్లు.. కొత్త ప్రయత్నం కోసం ఇంటిని అమ్మేస్తే వారించారు. కానీ నేనేమీ బదులివ్వలేదు. నచ్చింది చేసుకుంటూ వెళ్లా. ప్రయత్నం సఫలమైందా సరే.. లేదా మళ్లీ ఉద్యోగంలో చేరి నిలదొక్కుకోగలనన్నది ధైర్యం. అదే దేశవిదేశాల్లో మా వ్యాపారం విస్తరించడానికి కారణమైంది. మీరూ అంతే.. మీ కలల గురించి చర్చించకండి. సాధించుకుంటూ వెళ్లండి. ఏమీ తెలియదు, రేపు ఏమవుతుందో అని కూర్చుంటే అక్కడే ఉండిపోతారు. ధైర్యంగా అడుగేయండి.. నేర్చుకుంటూ ముందుకెళ్లడమెలాగో అదే తెలుస్తుంది.

- శుభ్ర చద్దా, సహవ్యవస్థాపకురాలు, చంబక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని