హేళనకు బదులివ్వాలి..

మాధురి భర్త కొన్నిసార్లు నవ్వుతూ చేసే హేళనలు చాలా ఆవేదన కలిగిస్తాయి. ఇటువంటప్పుడు వెంటనే అవతలి వారికి అదే తరహాలో సమాధానం ఇవ్వాలంటున్నారు నిపుణులు.

Updated : 31 Oct 2022 17:48 IST

మాధురి భర్త కొన్నిసార్లు నవ్వుతూ చేసే హేళనలు చాలా ఆవేదన కలిగిస్తాయి. ఇటువంటప్పుడు వెంటనే అవతలి వారికి అదే తరహాలో సమాధానం ఇవ్వాలంటున్నారు నిపుణులు. లేదంటే.. ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్లు, అవమానానికి గురయ్యామనే బాధ వెంటాడుతుంది. అంతేకాదు అవతలి వారి ప్రవర్తనా.. కొనసాగుతుంది.

భాగస్వామి సరదాగా ఆటపట్టించడానికి మాట్లాడటం, కావాలని హేళన చేయడం.. ఈ రెండింటి మధ్య తేడా గుర్తించాలి. తన ప్రవర్తన, హేళన చేయడం నచ్చనప్పుడు మర్యాదపూర్వకంగానే వారికి మీ మనసులో మాటను ధైర్యంగా చెప్పాలి. తన మాట తీరు మీ భావోద్వేగాలను గాయపరుస్తోందని సున్నితంగా వివరించాలి. మరొకసారి అలా మాట్లాడొద్దనాలి. ఇలా చెప్పడం భాగస్వామికి నచ్చదనో, వారు బాధపడతారనో మీ అభిప్రాయాన్ని చెప్పలేకపోతే, ఈ హేళన పద్ధతి కొనసాగుతూనే ఉంటుంది. ఇది నలుగురిలో ఉన్నప్పుడూ జరగొచ్చు. అంత్యనిష్టూరం కన్నా, ఆది నిష్టూరమే మేలు. అందుకే ముందుగానే చెప్పగలిగితే చాలు. మరొకసారి అలా ప్రవర్తిస్తే మన మధ్య సంభాషణ కరవవుతుందని చెప్పాలి. ఇలా చేస్తే, అవతలి వారిలోనూ క్రమేపీ అవగాహన కలిగి, ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు.  సహోద్యోగుల నుంచీ కూడా ఇటువంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు తోటి వారిని అవకాశం దొరికినప్పుడల్లా  హేళన చేసి అవమానించి ఆనందాన్ని పొందు తుంటారు. మరికొందరు సందర్భం కోసం ఎదురుచూసి మరీ అందరిలో అవమానిస్తారు. ఈ రెండు రకాల మనస్తత్వాల వారికీ మాటలతో ఎదుటివారి హృదయాన్ని గాయపరచడమే ధ్యేయం. ఇది ఎదుటి వారిపై చులకన భావం లేదా అసూయ వల్ల కూడా కావొచ్చు. ఇటువంటప్పుడు బాధపడుతూ కూర్చోకుండా, తక్షణమే బదులివ్వాలి. అప్పుడే మరొకసారి వారు ధైర్యం చేయరు. మీరిలా దీటుగా స్పందించాలంటే మానసికస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. మీరేమీ తక్కువ కాదని గుర్తించాలి. అప్పుడే ధైర్యం వస్తుంది. ఒకటి రెండు సార్లు ఇలా చేస్తే, తర్వాత మీ జోలికి రావడానికి వెనుకడుగు వేస్తారు. మీ ఆత్మగౌరవమూ పదిలంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్