వివాహానికి ముందు..
సరళ చదువు పూర్తయ్యిందో లేదో ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేముందు తనను తాను తెలుసుకోవాల నుకుంటోంది సరళ.
సరళ చదువు పూర్తయ్యిందో లేదో ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేముందు తనను తాను తెలుసుకోవాల నుకుంటోంది సరళ. ప్రతి ఒక్కరూ.. ముందు తామేంటో తెలుసుకొని జీవన నైపుణ్యాలు పెంచుకున్న తర్వాతే మరోవ్యక్తి జీవితంలోకి ప్రవేశించాలంటున్నారు నిపుణులు.
ఒంటరిగా కొన్నిరోజులు ప్రయాణం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే బయటి ప్రపంచం తెలిసే అవకాశం ఉంటుంది. తెలియని వ్యక్తులను కలుసుకున్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, వారి మనస్తత్వాలను అర్థం చేసుకొనే విధానం వంటి వాటిపై అవగాహన వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఎవరికి వారు తామెలా స్పందిస్తున్నామో కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎలా అడుగువేస్తే ఎటువంటి సందర్భం ఎదురవుతుందనేది తెలిస్తే, రేపటి ఛాలెంజ్‌లను తేలికగా దాటగలిగే ఆత్మస్థైర్యాన్ని పొందొచ్చు.
ఆర్థికంగా..
చదువు తర్వాత ఉద్యోగం, మనసుకు నచ్చిన కెరియర్ లేదా వ్యాపారరంగం వంటివి ఎంచుకోవడం తప్పనిసరి. ఆ తర్వాతే వైవాహికబంధంలోకి అడుగు పెడితే మంచిది. ఉద్యోగబాధ్యత నెమ్మదిగా క్రమశిక్షణ నేర్పుతుంది. ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడటమెలాగో తెలిసేలా చేస్తుంది. ఆర్థికప్రణాళికనెలా వేయాలో అవగాహన అందిస్తుంది. చిన్నచిన్న ఛాలెంజ్‌లను సాధించడానికి కృషి చేస్తే, దానికోసం చేసే పొదుపు విలువ తెలుస్తుంది. ఆర్థికపరంగా రోజూ ఎదురయ్యే ఛాలెంజ్‌లను ఎదుర్కొంటూ, వాటిని పరిష్కరిస్తుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో తోటివారితో కలిసి పనిచేసే విధానం, టీంను నడిపించడంలో నాయకత్వలక్షణాలు వంటివన్నీ తెలుసుకోవచ్చు. అప్పుడే భవిష్యత్తుకు కావాల్సిన మరిన్ని నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు.
ఒంటరిగా..
ఉద్యోగరీత్యా ఒంటరిగా ఉండాల్సి వస్తే వెనుకడుగు వేయకూడదు. అప్పుడే ఎవరికి వారికి తమ ఇష్టాలు, అయిష్టాలు, అభిరుచులు, శక్తియుక్తులు వంటివి తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. తమలోని బలహీనతలను గుర్తించొచ్చు. ఒంటరిగా జీవించినప్పుడు తమలోఉన్న అసలైన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.