దుప్పటి.. జారిపోదిక!

అసలే చలికాలం. ఎక్కడ పిల్లలు జబ్బు పడతారో అని జాగ్రత్తగా దుప్పటి కప్పేస్తాం. వాళ్లేమో నిద్రలో తన్నేస్తుంటారు. కాస్త పెద్దయ్యే వరకూ ఇదే సమస్య! రాత్రుళ్లు లేచి ఎన్నిసార్లని కప్పుతాం?

Published : 10 Nov 2022 00:07 IST

అసలే చలికాలం. ఎక్కడ పిల్లలు జబ్బు పడతారో అని జాగ్రత్తగా దుప్పటి కప్పేస్తాం. వాళ్లేమో నిద్రలో తన్నేస్తుంటారు. కాస్త పెద్దయ్యే వరకూ ఇదే సమస్య! రాత్రుళ్లు లేచి ఎన్నిసార్లని కప్పుతాం? ఈ స్లీపింగ్‌ బ్యాగులు లేదా యాంటీ కిక్‌ స్లీప్‌ బ్లాంకెట్లను తెచ్చేసుకోండి. దుప్పటి జారిపోతుందన్న భయముండదు. క్యూట్‌ బొమ్మలతో వస్తుంటాయి కదా.. పిల్లలూ ఇష్టపడతారు. భద్రపరచడమూ తేలికే! పెద్ద సమస్య తీరిపోయినట్లుగా అనిపిస్తోందా... అయితే తెచ్చేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని