చాడీలు, ఫిర్యాదులు మాన్పించాలి..

సౌజన్య నోరు తెరిస్తే ఇరుగుపొరుగు గురించి, బంధువుల గురించి ఉన్నవీ లేనివీ చెబుతూ ఉంటుంది. అమ్మను చూసి పదేళ్ల రమ్య కూడా స్కూల్‌ నుంచి రాగానే తోబుట్టువులు, టీచర్‌, సహ విద్యార్థులపై చాడీలు మొదలుపెడుతుంది.

Updated : 13 Nov 2022 03:25 IST

సౌజన్య నోరు తెరిస్తే ఇరుగుపొరుగు గురించి, బంధువుల గురించి ఉన్నవీ లేనివీ చెబుతూ ఉంటుంది. అమ్మను చూసి పదేళ్ల రమ్య కూడా స్కూల్‌ నుంచి రాగానే తోబుట్టువులు, టీచర్‌, సహ విద్యార్థులపై చాడీలు మొదలుపెడుతుంది. ఈ అలవాటు బంధాలను దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
పిల్లల ముందు ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వారితో ముందు ప్రేమగా మాట్లాడుతూ... వెనక ఎప్పుడూ తప్పులు వెతుకుతూ, నిందలు మోపుతూ, చెడుగా మాట్లాడకూడదు. పెద్దవాళ్లు ఇలా మాట్లాడుతుంటే పిల్లలు కూడా అదే నేర్చుకొని అనుసరిస్తారు. ప్రతి మాటకూ ఎంత విలువ ఉంటుందో చిన్నారులకు చెప్పాలి. ఎదుటివారిని బాధించేలా, వారి మనసు నొప్పించేలా కాకుండా ప్రేమగా మాట్లాడటం నేర్పాలి. అలాకాకుండా తల్లిదండ్రులు వారి ప్రవర్తనకు భిన్నమైన పద్ధతులు చెబుతూ ఉంటే పిల్లలు వాటిని వినరు. విన్నా ఆచరించరు.
స్నేహితులు.. ఇంట్లో మనం బానే ఉన్నా, కొందరు పిల్లలు ఇతరుల గురించి లేనిపోనివి మాట్లాడటం, చాడీలు చెప్పడం బయట నేర్చుకొని వస్తారు. చిన్నారుల మాటల్లో, వారి ప్రవర్తనలో ఇలాంటి మార్పు కనిపించినప్పుడు వెంటనే గుర్తించాలి. అలా ఫిర్యాదులు చేయడం, చెడుగా మాట్లాడటం తప్పు అని స్పష్టంగా చెప్పాలి. అలాకాక వారు చెప్పినదానికి తలూపుతూ ఉంటే అదే కొనసాగిస్తారు. ఈ అలవాటు సానుకూల ఆలోచనాధోరణిని దూరం చేస్తుంది. దాంతో ఎదుటి వారిలో తప్పులెంచడమే పనిగా పెట్టుకుంటారు.
బంధాలు.. లోపాలను మాత్రమే వెతికే అలవాటు, బంధాలను దూరం చేస్తుందని పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన కలిగించాలి. అనుబంధాల్ని ఏర్పరుచుకోవడంలో మాట ఎలా వంతెనగా మారుతుందో చెప్పాలి. తోటివారితో మన ప్రవర్తన, మాట్లాడే విధానం వంటివన్నీ నియమాల్లా నేర్పాలి. ఇవి వారిలో బృందంతో కలిసి పనిచేసే నైపుణ్యాలను అందిస్తాయి. అందరితో ప్రేమగా, ఆత్మీయంగా మెలిగే తత్వాన్ని నేర్పుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్