మాటల్లో పదును తగ్గితే మేలు
దంపతుల మధ్య ఎన్నో అసంతృప్తులుంటాయి. అలాగని ప్రతిదాన్నీ... లాగుతూ ఉంటే గొడవలే. ఈ క్రమంలో వాడే పదాలు, మాట్లాడే తీరూ కూడా ముఖ్యమే. ఇంట్లో వాళ్లే కదా అని ఇష్టం వచ్చినట్లు అనేయొద్దు.
దంపతుల మధ్య ఎన్నో అసంతృప్తులుంటాయి. అలాగని ప్రతిదాన్నీ... లాగుతూ ఉంటే గొడవలే. ఈ క్రమంలో వాడే పదాలు, మాట్లాడే తీరూ కూడా ముఖ్యమే. ఇంట్లో వాళ్లే కదా అని ఇష్టం వచ్చినట్లు అనేయొద్దు.
* భాగస్వామి ఇంటా, బయటా నడుచుకునే తీరులో ఏదైనా ఇబ్బంది ఉంటే... అందరిముందూ దాన్ని ఎత్తి చూపొద్దు. ఎప్పుడు చూసినా అలానే, నువ్విక మారవు... అంటూ అరిచేస్తే ఓ రకమైన మొండితనం అలవడుతుంది. నేనింతే అనే పరిస్థితి వస్తే... గొడవ మరింత ముదురుతుంది. అలాంటప్పుడు ‘ముందు ఈ పనయ్యాక అది చేయొచ్చుగా, నువ్వు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా’ అంటూ సానుకూలంగా చెప్పి చూడండి. కచ్చితంగా మార్పు కనిపిస్తుంది.
* సాధారణంగా ఇద్దరి కుటుంబ నేపథ్యాలు, అలవాట్లు, అభిరుచులు అన్నీ వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు... ప్రతిదీ ఒకేలా ఎలా ఆలోచించగలరు. వాటిని విమర్శించడం, వెక్కిరించడం వంటివి వద్దు. వీలైతే... ఆ విషయాలను ఆసక్తిగా తెలుసుకోండి. అలాకాకుండా... ఆ సమయంలో హేళన చేస్తున్నట్లు మాట్లాడే మాటలు మీ మధ్య దూరాన్ని పెంచేయగలవు.
* ప్రతి సందర్భంలోనూ ఎదుటివారి బాధల్నీ, ఇబ్బందుల్నీ... ఊహించి తెలుసుకోవడం కష్టం. అలాంటప్పుడు మాట్లాడే చిన్న మాటైనా... వారిని నొప్పించొచ్చు. భాగస్వామి ప్రవర్తనలో, మాట తీరులో తేడా ఉన్నప్పుడు... రెట్టించే ప్రయత్నం చేయొద్దు. మాటలతో, ఎక్కడెక్కడి విషయాలనో ప్రస్తావిస్తూ దానికి మరింత ఆజ్యం పోయొద్దు. వీలైతే అనునయంగా మాట్లాడి వారి బాధను అర్థం చేసుకోండి. పరిష్కారాల్ని సూచించండి. ఇదే కదా ఏ అనుబంధంలో అయినా... ఎదుటి వారి నుంచి కోరుకునేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.