చేయందిస్తే చాలు...

పిల్లలకు అన్నిరకాల జీవన నైపుణ్యాలు అలవడాలంటే....తల్లిదండ్రులుగా మనం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలంటారు మానసిక నిపుణులు.

Updated : 05 Dec 2022 03:59 IST

పిల్లలకు అన్నిరకాల జీవన నైపుణ్యాలు అలవడాలంటే....తల్లిదండ్రులుగా మనం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలంటారు మానసిక నిపుణులు.

* మీరెలా ఉన్నారో అలాగే వారినీ పెంచాలనుకుంటున్నారా? అస్సలొద్దు. మీ ఆశలకు ప్రతిబింబమే అయినా...వారిని స్వేచ్ఛగా ఎదగనివ్వండి. అలాకాకుండా ప్రతిదీ మీరే నేర్పించాలనీ, మీకు నచ్చినట్లుగానే చేయాలనీ అనుకోవద్దు. ఇలా చేస్తే వారు సొంతంగా ఆలోచించలేరు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సొంతంగా ఎదుర్కొనే స్థైర్యం వారికి ఇవ్వాలి. అప్పుడే ఇబ్బంది ఎదురైనప్పుడు చాకచక్యంగా వాటిని పరిష్కరించుకోగలరు.  

* పిల్లలు అడిగినవన్నీ కొనివ్వడం ద్వారా తమకు వారిపై చాలా ప్రేమ ఉందని అనుకుంటారు కొందరు. ఇంకొందరేమో తమ బిడ్డలు కష్టపడకూడదంటూ అన్నీ కాళ్లదగ్గరకే తెచ్చి ఇచ్చేస్తుంటారు.  ఇలా చేస్తే...వారు సులువుగా తీసుకోవడానికి అలవాటు పడిపోతారు. భవిష్యత్తులో కష్టపడాల్సిన వచ్చినప్పుడు ఇబ్బంది పడిపోతుంటారు. అందుకే ఏదైనా సరే అంత సులువుగా రాదనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. శ్రమించాల్సిన తీరుని వివరించండి.

* మీ స్థాయి ఏదైనా...పిల్లలు ఇతరులతో మెలిగే తీరుని మాత్రం నియంత్రించొద్దు. వాళ్లకి డబ్బులేదు. వీళ్లు నల్లగా ఉన్నారు అంటూ...మీరు ఏర్పరుచుకున్న వ్యతిరేక భావనలను ఆ చిన్ని మనసులపైనా రుద్దడం మంచిది కాదు. ఇవి వారి ఆలోచనలపై ప్రతికూల ముద్ర వేస్తాయి. భవిషత్తులో అలాంటివారితో కలిసి ప్రయాణించలేకపోవచ్చు. ఆత్మన్యూనతతో కొత్త సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. అందుకే...అంతా సమానమే అనే భావన వారికి కలిగించండి. అలా చేస్తేనే వారు ఉన్నతంగా ఎదుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్