ఒంటరిగా ఉంటున్నారా...

తోటి పిల్లలతో ఆడుతూ ఉల్లాసంగా గడపాల్సిన సమయంలోనూ కొందరు ఒంటరిగా ఉంటారు. కారణమడిగితే చికాకు పడతారు. కొంతసేపటికి వారే మామూలు అవుతార్లే అని వదిలి పెట్టకూడదంటున్నారు నిపుణులు. స్కూల్‌లో, స్నేహితులతో గొడవ పడ్డారేమో కనుక్కోవాలి. అనునయంగా మాట్లాడుతూ సమాచారాన్ని రాబట్టగలగాలి.

Published : 10 Dec 2022 00:43 IST

తోటి పిల్లలతో ఆడుతూ ఉల్లాసంగా గడపాల్సిన సమయంలోనూ కొందరు ఒంటరిగా ఉంటారు. కారణమడిగితే చికాకు పడతారు. కొంతసేపటికి వారే మామూలు అవుతార్లే అని వదిలి పెట్టకూడదంటున్నారు నిపుణులు.

స్కూల్‌లో, స్నేహితులతో గొడవ పడ్డారేమో కనుక్కోవాలి. అనునయంగా మాట్లాడుతూ సమాచారాన్ని రాబట్టగలగాలి. సరైన సమాధానం చెప్పకపోతే ఆ విషయాన్ని కాసేపు వదిలేసి వేరే వాటి గురించి మాట్లాడాలి. ఒంటరిగా, ఖాళీగా కూర్చోనివ్వకుండా వారికిష్టమైన ఏదోక పని చెెప్పి చేయమనాలి. అప్పుడు వారి బాధ/ కోపం తగ్గుముఖం పడుతుంది. తర్వాత వారే మెల్లగా నోరు విప్పుతారు.

కారణం... చిన్నపిల్లలకేం సమస్యలుంటాయని తేలిగ్గా తీసుకో వద్దు. వారి ప్రతి కదలిక వెనుక ఏదో ఒక విషయం దాగి ఉంటుంది. చిన్నారులతో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా వారి హృదయాన్ని చదవగలం. తమ సమస్యను చెప్పినప్పుడు అది పెద్దవాళ్లకు చిన్నగానే కనిపించొచ్చు. అయితే పిల్లలస్థాయికి అది పెద్దది కావొచ్చు. వారి భావోద్వేగాలకు విలువనివ్వాలి. అదే స్థాయిలో ఆలోచించి పరిష్కారం చెప్పినట్లుగా ఉంటేనే వారికి తృప్తి. అప్పుడే వారి ఆందోళన, ఒత్తిడి దూరమవుతాయి.

స్పష్టత.. చిన్నారుల ఆలోచనా విధానంలో ఎంత స్పష్టత ఉందో గుర్తించాలి. సమస్యను చెప్పనివ్వాలి. పిల్లల ముందు కాకుండా, వీలైనప్పుడు ఉపాధ్యాయులతో మాట్లాడాలి. పిల్లలెలా నడుచుకుంటున్నారన్నది వారి కోణం నుంచీ తెలుసుకుంటేనే అన్ని వైపుల నుంచి వాళ్ల మనసు అర్థమవుతుంది. స్కూల్‌లో ఎటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారో గుర్తించాలి. అక్కడ పిల్లల ప్రవర్తనెలా ఉందో తెలుసుకోవాలి. ఆ ప్రభావమూ పిల్లలపై పడే ప్రమాదం ఉంది.

భరోసా.. తమ బాధ, వేదనను చెబితే పెద్ద వాళ్లు సానుకూలంగా తీసుకొని పరిష్కారం చెబుతారనే భరోసా పిల్లలకు దొరకాలి. తప్పు చేసినప్పుడు దండించినా, స్నేహితులుగానే మెలగాలి. అప్పుడే వారికి అమ్మ ఒడి లేదా నాన్న సాన్నిధ్యం భరోసాగా ఉంటుంది. అది సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది. మంచి అలవాట్లు నేర్పాలి. ఇతరులు మాట్లాడే విధానాన్ని బట్టి వారినెలా అర్థం చేసుకోవాలో శిక్షణనివ్వాలి. దీనికి ఇంట్లో చిన్నచిన్న డిబేట్స్‌ ఏర్పాటు చేసి సరదాగా వారికి తెలియకుండానే నేర్పడానికి ప్రయత్నిస్తే చాలు. వారికంటూ బలమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. చిన్నచిన్న సమస్యలకు భయపడటం మానేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్