అనుబంధంలోనూ సంకల్పాలు...

నూతన ఏడాదిలో అడుగు పెట్టాం. కొత్త నిర్ణయాలు తీసుకుని ఉంటారు. మరి మీ ప్రియమైన జీవిత భాగస్వామితో అనుబంధాన్ని మరింత పెంచుకోవడానికి దాంపత్య సంకల్పాలు కూడా ముఖ్యమే కదా.  

Updated : 06 Jan 2023 06:10 IST

నూతన ఏడాదిలో అడుగు పెట్టాం. కొత్త నిర్ణయాలు తీసుకుని ఉంటారు. మరి మీ ప్రియమైన జీవిత భాగస్వామితో అనుబంధాన్ని మరింత పెంచుకోవడానికి దాంపత్య సంకల్పాలు కూడా ముఖ్యమే కదా.  అందుకు నిపుణులు ఏం చెబుతున్నారంటే....

భార్యాభర్తల మధ్య ప్రేమ ఎప్పటికప్పుడు చిగురిస్తూనే ఉండాలి. లేదంటే అది వాడి పోయే ప్రమాదం లేకపోలేదు. దీనికోసం ఇరువురూ ప్రయత్నించాలి. రోజులన్నీ ఒకేలా ఉండనట్లే.. దాంపత్యంలోనూ సవాళ్లు, బాధ్యతలు, ఒత్తిళ్లు వస్తూనే ఉంటాయి. అన్నింటినీ సమానంగా తీసుకుంటూ ముందుకెళ్లడానికి ప్రయత్నించాలి. ఇరువురూ చేతులు కలిపితే ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే బలం వస్తుంది. సమస్యలు దూది పింజలుగా మారతాయి.

సమస్యలొచ్చినప్పుడు అవి ఎవరి వల్ల వచ్చాయనే ఆలోచన కాకుండా సమష్టిగా పరిష్కరించుకోవాలనే సంకల్పం చెప్పుకోండి.

నేర్చుకొని..

భాగస్వామిలోని ప్రత్యేకతను గుర్తించడం అత్యంత ముఖ్యం. అది తనకొచ్చిన మరో భాష కావొచ్చు, లేదా కొత్త వంట, నృత్యం అవ్వొచ్చు. ఏదైనా వినూత్నంగా ఉన్నప్పుడు ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవాలని సంకల్పంగా పెట్టుకోండి. ఇరువురూ తమ నైపుణ్యాలను ఎదుటివారికి పంచడంలో సంతోషం నిండి ఉంటుంది. అవతలివారు తమను గుర్తించారనే తృప్తి వారిపై ప్రేమను మరింత పెంచుతుంది. ఇవన్నీ దంపతులను మరింత దగ్గర చేస్తాయి.

పంచుకోవాలి..

మీ ఆలోచనలు, ఆందోళనలు, సమస్యలు వంటివన్నీ జీవిత భాగస్వామితో పంచుకోవాలనే సంకల్పం ఇరువురి మధ్యా వాతావరణాన్ని తేలిక పరుస్తుంది. అవతలి వారు చెప్పేటప్పుడు పూర్తిగా వినడం నేర్చుకుంటే చాలు. ఆ సంసారం సంతోషంగా సాగిపోతుంది. భాగస్వామికి ఇష్టమైన వాటిని అడిగి తెలుసుకొని వాటినీ మీకు సంబంధించినవిగా భావించాలి. వ్యాయామం, సినిమా, పర్యాటకం.. వాటికి మీరూ సమయాన్ని కేటాయించగలిగితే మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి దరి చేరవు.

కానుకగా..

ఎదుటివారిలో అభినందించే విషయాన్ని గుర్తించి.. దానికో చిరుకానుకనూ అందించాలనేది నియమాల్లో ఉంచుకోవాలి. విమర్శలు మానేసి, అవతలి వారికిచ్చే చిన్న చిన్న ప్రశంసలు ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. సమయం దొరికినప్పుడల్లా ఇండోర్‌, అవుట్‌డోర్‌ క్రీడలు తప్పనిసరిగా ఆడాలి. ఇవి శారీరక, మానసికారోగ్యాన్ని పెంపొందేలా చేస్తాయి. సంతోషానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్