వారినే కాదు... మిమ్మల్నీ ఇష్టపడండి!

వైవాహిక బంధంలో అనుబంధాలూ, ఆప్యాయతలతో పాటూ అలకలూ, సర్దుబాట్లు వంటివీ ఉంటాయి. వాటన్నింటినీ నిశితంగా అర్థం చేసుకుంటేనే ఆ సంసారం సంతోషంగా సాగిపోతుంది. అందుకోసం నిపుణులు చెబుతోన్న సూచనలివి.

Published : 06 Feb 2023 00:13 IST

వైవాహిక బంధంలో అనుబంధాలూ, ఆప్యాయతలతో పాటూ అలకలూ, సర్దుబాట్లు వంటివీ ఉంటాయి. వాటన్నింటినీ నిశితంగా అర్థం చేసుకుంటేనే ఆ సంసారం సంతోషంగా సాగిపోతుంది. అందుకోసం నిపుణులు చెబుతోన్న సూచనలివి.

పెళ్లికి ముందు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికీ కొన్ని ఊహలు ఉంటాయి. అన్నీ అనుకున్నట్లు జరిగిపోవడానికి జీవితం... సినిమా కాదనే విషయం మరిచిపోవద్దు. ఒకవేళ అనుకున్నట్లు జరగకపోయినా.. మనసుని బాధ పెట్టుకోవద్దు. మీ చేతిలో ఉన్న భవిష్యత్తుని మీరెంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చో ఆలోచించండి.

వేర్వేరు వాతావరణాల్లో పెరిగిన  వ్యక్తులు ఒకటిగా కలిసి నడుస్తున్నప్పుడు కొన్ని అభిప్రాయాలు, అలవాట్లూ భిన్నంగా ఉండొచ్చు. అంత మాత్రన...అవతలి వారితో తగాదాలకు దిగొద్దు. మీకు నచ్చినట్లే ఉండమనడమూ సరికాదు. ఎదుటివారి పరిస్థితుల్నీ, ఆలోచనల్నీ అర్థం చేసుకోండి. కొత్త విషయాలు తెలుసుకుంటూ సాగితే మీరూ సంతోషంగా ఉండొచ్చు.

పెళ్లవ్వగానే... ఎదుటివారిని సంతృప్తిపరచడానికి తమని తాము మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ.. మానసికంగా సతమతమవుతుంటారు. మంచి ఎక్కడ ఉన్నా...నేర్చుకోవాలి. పద్ధతులూ, పనులూ అలవాటు చేసుకోవడంలోనూ తప్పులేదు. కానీ, ఎదుటివారి మెచ్చుకోలు ఎంత అవసరమో, మిమ్మల్ని మీరు ఇష్టపడటమూ, మీరు మీరుగానే ఉండటం కూడా అంతే ముఖ్యం అన్న విషయం మరిచిపోవద్దు. లేదంటే మనసు మూలల్లో దాక్కున అసంతృప్తి మీ అనుబంధాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్