ఏం ఫరవాలేదు...నేర్చుకోనివ్వండి...

ఎదిగే పిల్లలు...భవిష్యత్తులో తమని తాము మలుచుకోవడానికి పునాది చిన్నప్పుడే పడుతుందంటారు మానసిక నిపుణులు. అందుకే, ఇంటిపనులు, వ్యక్తిగత అవసరాలను స్వయంగా పూర్తి చేసుకోవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. 

Published : 17 Mar 2023 00:07 IST

ఎదిగే పిల్లలు...భవిష్యత్తులో తమని తాము మలుచుకోవడానికి పునాది చిన్నప్పుడే పడుతుందంటారు మానసిక నిపుణులు. అందుకే, ఇంటిపనులు, వ్యక్తిగత అవసరాలను స్వయంగా పూర్తి చేసుకోవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. 

యసుకి చిన్నవారే అయినా... ఏ విషయాన్నైనా పెద్దలకంటే సులువుగా నేర్చుకోగలుగుతారు. అందుకే ఇంటిపనిలో వారినీ భాగస్వాముల్ని చేయండి. దీనివల్ల రోజువారీ పనులు తమంతటతాముగా చేసుకోగలుగుతారు. ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది.

* తమ పిల్లలకు అపజయం అనేదే తెలియకుండా పెంచాలని కొంతమంది తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటారు. ఇలా పెంచడం వల్ల భవిష్యత్తులో దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే జీర్ణించుకోలేక చిన్నారులు కుంగుబాటుకు గురయ్యే ప్రమాదముంది. అందుకే కొన్ని పనుల విషయంలో వారికి నిర్ణయాధికారం కూడా ఇవ్వాలి. జరిగే పొరపాట్లకు బాధ్యత తీసుకోవడమూ నేర్పాలి.

* పనిలో పొరబాట్లు సహజం. చిన్న తప్పు జరగ్గానే... నీకేం రాదనేయొద్దు. ఎందుకు ఆ పనిచేయలేకపోయారో గమనించుకోమనండి. మరో విధంగానైనా దాన్ని పూర్తి చేయగలరేమో ఆలోచించమని ప్రోత్సహించండి. అప్పుడు కొత్త కొత్త టెక్నిక్‌లు కూడా కనిపెట్టగలరు. సొంతంగా పనులు పూర్తి చేయగలిగనప్పుడు వారిలో ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్