ఇంటికి దూరంగా ఉన్నారా?

ఇప్పుడు అమ్మాయిలూ పై చదువులు, ఉద్యోగాలంటూ ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఎంత స్వేచ్ఛ దొరికినా.. ఇంటిపై బెంగ అలాగే ఉంటుంది. ఒక్కోసారి మనసు విప్పి అన్నీ పంచుకోవడానికి దగ్గరివారు పక్కనే ఉండకపోవడమూ ఒత్తిడే!

Published : 20 Mar 2023 00:23 IST

ఇప్పుడు అమ్మాయిలూ పై చదువులు, ఉద్యోగాలంటూ ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఎంత స్వేచ్ఛ దొరికినా.. ఇంటిపై బెంగ అలాగే ఉంటుంది. ఒక్కోసారి మనసు విప్పి అన్నీ పంచుకోవడానికి దగ్గరివారు పక్కనే ఉండకపోవడమూ ఒత్తిడే! ఇలాంటప్పుడే ఓ మొక్కను తెచ్చుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే..

* ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం కొందరు ఉద్యోగులపై పరిశోధన చేసింది. కొందరికేమో కొంత వ్యవధి ఇచ్చి కంప్యూటర్‌పై ఓ పని పూర్తిచేయమన్నారు. ఇంకొందరికేమో మొక్కల మధ్య చేసే పనిచ్చారు. తర్వాత వాళ్ల గుండె వేగం, రక్తపోటు వగైరా పరిశీలిస్తే కంప్యూటర్‌పై పనిచేసిన వారిలోనేమో ఎక్కువగా కనిపించాయట. మొక్కలతో పని చేసినవారిలో ఇవన్నీ సాధారణంగా ఉన్నాయట. మొక్కను పక్కనే ఉంచుకోవడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే హార్మోను అదుపులో ఉంటుంది. దీనివల్ల శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* మొక్కలు ఏకాగ్రతను పెంచడంలోనూ సాయపడతాయట. అంతేకాదు.. వీటి పచ్చదనం మనసుపై ప్రభావం చూపి, కోపం, ఆందోళన వంటి వాటినీ తగ్గిస్తాయి. గాలికి ఊగుతూ నవ్వుతున్నట్లు ఉండే ఇవి మనసులోని ప్రతికూల ఆలోచనలను తగ్గించడమే కాదు ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతాయి. కోపం, ఆందోళన కలిగినప్పుడు మొక్కలకేసి కొన్ని నిమిషాలు చూస్తే చాలట. అవి తగ్గుముఖం పడతాయి.

* మన కోసం ఇంటి దగ్గర ఒకరు ఎదురు చూస్తున్నారన్న భావన ఎంత బాగుంటుంది? మొక్కలూ ఆ పని చేయగలవట. ఇంట్లో మొక్కలు ఉన్నవాళ్ల మనసు వాటి సంరక్షణవైపు లాగుంతుంటుందట. అందుకే ఈ అనుభూతి కలుగుతుంది.

* ఇవన్నీ కొన్ని అధ్యయనాలు రుజువు చేసిన అంశాలు. కాబట్టి మనసు దిగులుగా అనిపిస్తోంటే వెంటనే మొక్కలు తెచ్చేసుకోండి. అలాగని పెద్ద గార్డెన్‌లే పెంచాల్సిన పనిలేదు. సులభంగా పెంచే ఇండోర్‌ మొక్కలు తెచ్చుకుంటే శ్రమా అనిపించదు, ఉల్లాసంగానూ ఉంటుంది. ప్రయత్నించండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్