Published : 02/04/2023 00:26 IST

తిట్టొద్దు.. తోడుండాలి

పిల్లలు కౌమారంలోకి అడుగుపెట్టాక తెలిసీ తెలియక ఆకర్షణలకు లోనవుతుంటారు. ఒకవేళ వారు ఎంచుకున్న వారు హింసించే వారైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటప్పుడు తల్లిగా మనం ఏం చేయాలంటే..

నిందించకండి.. సమస్యను వారంతట వారే చెప్పే స్వేచ్ఛ వాళ్లకుండాలి. తమ ఇబ్బందిని చెప్పినా నిందించొద్దు. విషయాన్ని పూర్తిగా వినాలి. తప్పు చేశామని కుంగిపోయేలా చేయక తోడు నిలవాలి.

ధైర్యాన్నివ్వండి.. ఈ సమయంలో వారు మన నుంచి ఓదార్పు కోరుకుంటారు. ఇలాంటప్పుడే మన ప్రేమనీ, భరోసాను అందించాలి. అప్పుడే వాళ్లు ఆ బంధం నుంచి బయటపడగలిగే ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోగలరు. తాము ప్రేమిస్తున్న వ్యక్తి గురించి చెడుగా చెప్పకుండా పరిస్థితులు అర్థమయ్యేలా మాత్రమే చెప్పాలి. వాళ్లంతట వాళ్లే తెలుసుకున్నప్పుడే దాన్నుంచి బయటకు రాగలరు.

ఒత్తిడి చేయొద్దు..  అమ్మాయి ప్రేమించిన వ్యక్తి మంచివాడు కాకపోతే విడిపొమ్మని నేరుగా చెప్పకండి. బెదిరింపులు అసలే వద్దు. వారంతట వారే ఆ నిర్ణయం తీసుకోడానికి సిద్ధమైతేనే వాళ్లు దృఢంగా తయారవుతారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి ఎదురైనాే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని