ఫోన్లకు దూరంగా.. మరింత ఉత్తేజంగా..

వేసవి.. ఒంటిపూట బళ్లు.. పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. ఫోన్లు, టీవీలే వాళ్ల ప్రధాన కాలక్షేపాలు. చిన్నిబుర్రలకేమో అవి చేటు చేస్తాయి. వద్దంటేనేమో మంకు పట్టుపడతారు.

Published : 10 Apr 2023 00:49 IST

వేసవి.. ఒంటిపూట బళ్లు.. పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. ఫోన్లు, టీవీలే వాళ్ల ప్రధాన కాలక్షేపాలు. చిన్నిబుర్రలకేమో అవి చేటు చేస్తాయి. వద్దంటేనేమో మంకు పట్టుపడతారు. కాబట్టి.. కాస్త ఉల్లాసంగా గడుపుతూనే కొత్త నైపుణ్యాలు నేర్చుకునేలా చేద్దామా?

విజ్ఞానయాత్రతో.. పిల్లలను జూ పార్కులు, మ్యూజియం, చారిత్రక కట్టడాలుండే ప్రదేశాలకు తీసుకెళ్లండి. అటు విహారాన్ని ఇటు విజ్ఞానాన్ని అందించినట్టు అవుతుంది. అంతేకాదు.. ఇవి తరగతిలో పాఠాలు బయట స్వయంగా తెలుసుకునే వీలునీ కల్పిస్తాయి. దీంతో వాళ్లూ ఆసక్తి కనబరుస్తారు. సమ్మర్‌ క్యాంపులు లేదా ఆటల్లో చేర్చినా సరే! సామాజిక నైపుణ్యాలు అలవడతాయి.

అలవాట్లు మార్చాలి.. ఫోనే ప్రపంచమైన ఈ కాలంలో పిల్లలు పుస్తకాలు చదవటానికి అంతగా ఆసక్తి చూపించరు. అలాంటప్పుడు వారితో పాటు మనమూ కలిసి కూర్చుంటే సరి. ముందు మనం చదివి, కథలు చెప్పడం, వాటిల్లోని నీతిని చర్చించడం లాంటివి చేస్తే సరి. వాళ్లకీ ఆసక్తి కలిగి చదవడం మొదలుపెడతారు. వారిలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెరగటమే కాదు.. బంధమూ బలపడుతుంది.

ఇంటి పనుల్లో.. పిల్లల్నీ ఇంటి పనుల్లో భాగస్వాముల్ని చేయాలి. మార్కెట్టు, బ్యాంకు ఇలా అన్ని చోట్లకూ వాళ్లను తీసుకెళ్లాలి. అప్పుడే బాధ్యతలు తెలుస్తాయి. చిన్న వయసులోనే జీవన నైపుణ్యాలు అలవరచుకుంటే పెద్దయ్యాక ఇబ్బందులు పడకుండానూ ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్