సమయం విలువ చెప్తున్నారా!
పిల్లలు ఆటలు ఆడినా, ఫోను చూసినా, సినిమాలు చూస్తున్నా అసలు సమయం తెలియకుండా గడిపేస్తారు. చదివేందుకు ఇతర వ్యాపకాలకు సమయం లేదని వాపోతారు.
పిల్లలు ఆటలు ఆడినా, ఫోను చూసినా, సినిమాలు చూస్తున్నా అసలు సమయం తెలియకుండా గడిపేస్తారు. చదివేందుకు ఇతర వ్యాపకాలకు సమయం లేదని వాపోతారు. అలా కాకుండా వారికి సమయాన్ని ఎలా వినియో గించుకోవాలో నేర్పుదామా..
* హోంవర్కులు, చదువు.. ఏపని చేస్తున్నా డెడ్‌లైన్ పెట్టండి. ఆ సమయంలోగా పూర్తి చేసేలా ప్రోత్సహించండి. వీలైతే అలారం లాంటివి ఉపయోగిస్తే ఉత్సాహంగా పని ముగించేస్తారు. ప్రారంభంలో ఇబ్బంది పడినా పోనుపోనూ అలవాటుపడతారు.
* ముఖ్యంగా భోజన సమయంలో టీవీ, ఫోనుకు దూరంగా ఉంచండి. వాటి ముందు కూర్చొంటే ఎంత సేపైనా అలా చూస్తూనే ఉంటారు. స్క్రీన్లు చూస్తూ తినటం అలవాటు అయితే కంటి సమస్యలు కూడా వస్తాయి.
* రోజూ చేసే పనులకు ప్రణాళిక వేయండి. దానికనుగుణంగా ఒక పట్టిక సిద్ధం చేసుకొనేలా సాయం చేయండి. దాన్ని వారి బెడ్‌రూంలో అంటించండి. ఇలా చేస్తే పిల్లలకు టైం మేనేజ్‌మెంట్‌పై అవగాహన వస్తుంది.
* ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం నేర్పించండి. అలా కాకుండా వాయిదా వేయడం మొదలు పెడితే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను వివరించండి. అలాగే నిద్రావేళలు కూడా రోజూ ఒకేలా ఉండేలా చూస్తే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.