అలిగి.. కూర్చున్నారా?

సుమతి కూతురు కాలేజీలో చదువుతోంది. వారంలో కనీసం రెండుమూడుసార్లైనా అమ్మతో మాట్లాడటం మానేస్తుంటుంది. యుక్తవయసులో ఈ ప్రవర్తన వెనుక కారణాన్ని తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 13 Apr 2023 00:07 IST

సుమతి కూతురు కాలేజీలో చదువుతోంది. వారంలో కనీసం రెండుమూడుసార్లైనా అమ్మతో మాట్లాడటం మానేస్తుంటుంది. యుక్తవయసులో ఈ ప్రవర్తన వెనుక కారణాన్ని తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

కౌమారదశలోకి పిల్లలు అడుగు పెట్టేటప్పుడు స్నేహితులు, సహవిద్యార్థుల ప్రభావానికి ఎక్కువగా లోనవుతుంటారు. ప్రతి విషయంలోనూ తమకంటూ ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. ఇంట్లో వీటన్నింటికీ భిన్నంగా అమ్మానాన్న చెప్పే సూచనలు, సలహాలు వారికి నచ్చవు. ఆహారం తీసుకోవడం, చదివే పద్ధతి, అలవాట్లు, ప్రవర్తించే తీరు, ఆహార్యంలో జోక్యాన్ని సహించలేరు. ఇక పెద్దవాళ్లేమో యుక్త వయసులో పిల్లలను క్రమశిక్షణగా ఉంచకపోతే చెడు దారిలోకి వెళతారేమో అని భయపడుతుంటారు. అన్నీ మాకు తెలు సన్నప్పుడు అమ్మానాన్న ఎందుకిలా మా అభి ప్రాయాలను ఖండిస్తున్నారనే కోపం పిల్లల్లో మొదలవుతుంది. ఇది అసహనంగా మారి ఇంట్లో మాట్లాడటం మానేసి, నిరసనను తెలియజేస్తుంటారు.

నమ్మకంతో.. తీవ్రమైన క్రమశిక్షణ, చెప్పేది వినాలనే నియమం, శిక్షలు వంటివన్నీ కౌమారదశ పిల్లల్లో అసహనాన్ని పెంచుతాయి. అలాకాకుండా తల్లిదండ్రులు బాల్యం నుంచి పిల్లలపై నమ్మకం ఉంచాలి. వారి అభిప్రాయానికి విలువనివ్వాలి. ఇవన్నీ పిల్లల్లో భరోసా నింపుతాయి. అప్పుడు పెద్దవారిపై వ్యతిరేకతకు తావుండదు. అలాగే ఏ విషయమైనా అందరూ కలిసి మృదువుగా చర్చించుకొనే అలవాటు చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాలి. అప్పుడే ఒకరికొకరు అర్థమవుతారు. తమ కుటుంబం, తల్లిదండ్రులనే అనుబంధం వారిలో పెరుగుతుంది. పెద్దవాళ్లిచ్చే సలహాను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆలోచనలనూ పంచు కుంటారు. అంతేకాదు, పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే మృదువుగా మాట్లాడి సమస్యను తెలుసుకోవాలి. దాన్ని పరిష్కరించడంలో చేయూతనివ్వాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్