చిన్నప్పుడే నేర్పాలి...

ఎదిగే పిల్లలకు మంచీ చెడూ మనమే నేర్పించాలి. వారు ఏది ఒంట పట్టించుకున్నా అది చిన్నప్పుడే. అందుకోసం ఏం చేయాలంటే...

Updated : 16 Apr 2023 02:51 IST

ఎదిగే పిల్లలకు మంచీ చెడూ మనమే నేర్పించాలి. వారు ఏది ఒంట పట్టించుకున్నా అది చిన్నప్పుడే. అందుకోసం ఏం చేయాలంటే...

* పిల్లలంటే ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు... అలాగని అతిగారాబం చేయొద్దు. మితిమీరి అల్లరి చేస్తున్నా, మాటలు, చేతలు అదుపులో లేకపోయినా చూసీ చూడనట్లు వదిలేయకండి. మీ అతి ప్రేమ వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలే కానీ... చెడగొట్టకూడదని మరిచిపోవద్దు.

* అడిగిందల్లా తెచ్చివ్వడం, కోరిందల్లా చేసేయడం... పిల్లలపై ఉన్న ప్రేమను తెలియచెప్పొచ్చు. కానీ అదే ప్రేమకు నిదర్శనం కాదు. ఇలా తరచూ చేస్తుంటే అన్నీ అలానే వస్తాయనే భ్రమలో పడతారు. ఏ ఫలితమైనా శ్రమతోనే సాధ్యమవుతుందని తెలిసేలా చేయండి. దాన్ని అలవాటు చేసుకుని కోరుకున్నవి దక్కించుకోవాలని చెప్పాలి.

* పిల్లల ఎదురుగా అబద్ధాలు ఆడకండి. స్కూల్లో వేరే వాళ్ల వస్తువులు తెస్తే ప్రోత్సహించకండి. అవి చిన్న చిన్న విషయాలే కావొచ్చు కానీ ఆ చిన్ని మనసులపై తీవ్రప్రభావం చూపిస్తాయి. మీరు ఏం చేస్తే దాన్నే వారు అనుసరించే ప్రమాదం ఉంది. నిజాయతీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు నిష్ఠూరాలు ఎదురైనా చివరికి గెలుపు మనదే అని తెలిపే ఉదాహరణలు ఇవ్వండి.

* ప్రతి ఒక్కరూ.. తమ పిల్లలు ప్రత్యేకం అనే అనుకుంటారు. అలాగని ఇతరులతో కలవనివ్వకపోవడం మంచిది కాదు. ఇది వారిలో ప్రతికూల ఆలోచనలకు, సంకుచితత్వానికీ కారణం అవ్వొచ్చు. కలిసినప్పుడు ఇతరులతో ఎలా ప్రవర్తించాలో చెప్పాలి. అలానే చేయకూడని విషయాలూ ప్రస్తావించాలి. అప్పుడే తప్పొప్పులు తెలుసుకునే విచక్షణ వారిలో పెరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్