దాపరికాలే దాంపత్యానికి అడ్డుగోడలు...

ఆలుమగలుగా ఇద్దరూ ఒకే మాటగా నడవాలనుకున్నప్పటికీ ... అలవాట్లూ, అభిరుచులూ, ఆలోచనల్లో కొన్ని తేడాలూ కనిపిస్తాయి. ఇలాంటప్పుడు వాదోపవాదాలకు తావివ్వకుండా ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవిస్తే సమస్యకు పరిష్కారం లభించినట్లే అంటారు మానసిక నిపుణులు. 

Published : 19 Apr 2023 00:32 IST

ఆలుమగలుగా ఇద్దరూ ఒకే మాటగా నడవాలనుకున్నప్పటికీ ... అలవాట్లూ, అభిరుచులూ, ఆలోచనల్లో కొన్ని తేడాలూ కనిపిస్తాయి. ఇలాంటప్పుడు వాదోపవాదాలకు తావివ్వకుండా ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవిస్తే సమస్యకు పరిష్కారం లభించినట్లే అంటారు మానసిక నిపుణులు. 

* పెళ్లయ్యాక కూడా ఎవరికి వారు తమకంటూ కొంత స్పేస్‌ ఇచ్చుకోవడం తప్పనిసరి. అలానే, కొన్ని నిర్ణయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా వెల్లడించగలగాలి. అయితే అవి, ఒంటెద్దు పోకడల్లా ఉండకూడదు. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచకూడదు. ఒక విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉండొచ్చు. తమదే కరెక్ట్‌ అని వాదించాల్సిన పరిస్థితి వస్తే మధ్యే మార్గంగా చర్చలకు అవకాశం కల్పించండి. అప్పడు ఎలాంటి సమస్య అయినా ఇట్టే పరిష్కారమవుతుంది.

* పెళ్లికి ముందు వరకూ... మీ ఇద్దరి జీవితాలూ వేరు. చిన్న విషయమే అయినా దాపరికం ఎదుటివారిలో అభద్రతను పెంచుతుంది. అందుకే, ఇద్దరూ వీలైనంత పారదర్శకంగా, నిజాయతీగా ఉండాలి. భాగస్వామిని ఇతరులతో పోల్చి చూడటం, చిన్న పొరపాటుకి కూడా పదే పదే ఎత్తి చూపడం వల్ల సమస్య పరిష్కారం అవదు సరికదా... ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుంది. మీ అభిప్రాయాలనూ, ఇబ్బందులనూ సూటిగా, స్పష్టంగా చెప్పగలిగితే సమస్య పరిష్కారమవుతుంది.

* భార్యాభర్తల్లో కొందరు... భాగస్వామి తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని బాధపడిపోతుంటారు. అయితే, అందరూ ఒకేలా భావాల్ని వ్యక్తపరచలేరనే సంగతిని అర్థం చేసుకోండి. మిగిలిన సందర్భాలు ఎలా ఉన్నా...పెళ్లిరోజు, పుట్టినరోజు వంటివాటిని ఎక్కడైనా నోట్‌ చేసుకుని విష్‌ చేస్తే చాలు. వారి ఒత్తిడీ, అపోహలూ, అపార్థాలూ తొలగి సంతోషంతో సాగిపోతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని