సామాజిక మాధ్యమాల మోజు..

ఈ తరం పిల్లలు ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. గంటకొక స్వీయ చిత్రం తీసుకుంటారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేందుకు ఆరాటపడతారు.

Published : 21 Apr 2023 01:09 IST

తరం పిల్లలు ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. గంటకొక స్వీయ చిత్రం తీసుకుంటారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేందుకు ఆరాటపడతారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విటర్‌ వంటి వాటి వలలో చిక్కుకుంటున్నారు. దాదాపు 95శాతం టీనేజర్లు సామాజిక మాధ్యమాలను వాడుతున్నారు. వాటిల్లో 45శాతం మంది నిరంతరం ఆన్‌లైన్లోనే ఉంటున్నారు. వాటిలోంచి పిల్లల్ని బయటికి తీసుకురావటం కొంత కష్టమే కానీ ప్రయత్నించమంటున్నారు నిపుణులు.

* తల్లిదండ్రులు వృత్తి జీవితంలో బిజీగా ఉండి పిల్లల్ని సరిగా గమనించరు. వారికి విసుగు అనిపించకుండా ఫోను ఉందిగా అనుకుంటారు. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో గమనించరు. పిల్లలతో రోజూ ఓ గంట కూర్చొని చక్కగా మాట్లాడి రోజెలా గడిచింది, వారి స్నేహితులు, చదువు గురించి ఆరా తీయండి.

* వారి పోస్టులకు లైకులు ఎన్ని వచ్చాయనే విషయంపై మానసిక సంఘర్షణకు గురవుతుంటారు. నిద్రాహారాలు మాని వేదన చెందుతారు. పిల్లలు కదా సున్నితంగా వ్యవహరించాలని ఆలోచిస్తున్నారా! కానీ పరిస్థితులు చేయి దాటిపోతున్నప్పుడు కొంత కఠినత్వం ప్రదర్శించాల్సిందే. కాస్త గట్టిగా మందలించి నియంత్రించాలి.

* ఫోను ధ్యాసలో పడి  చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోతారు. చదువుపై కూడా ధ్యాస పెట్టలేరు. కెరియర్‌ గురించి ఆలోచించే పెద్ద వయసు కాదని వెనకేసుకొని రాకుండా తల్లిగా బాధ్యత తీసుకోండి. దగ్గర కూర్చొని దాని వల్ల జీవితంలో ఏమేం కోల్పోతారో వివరించి చెప్పండి.

* లైకులు వచ్చినప్పుడో లేదా బహుమతులు వచ్చినప్పుడో సంతోషంగా ఉంటారు. ఇవి మెదడులో డొపమైన్‌ అనే న్యూరోట్రాన్స్మిటర్‌ని విడుదల చేస్తుంది. ఇది యుక్త వయస్కులపై మరింత ప్రభావం చూపిస్తుంది. ఒక్కసారే వారి నుంచి ఫోన్‌ దూరం చేసినా కుంగిపోతారు. కాబట్టి రోజూ కొంత సమయాన్ని నియంత్రిస్తూ వచ్చి అదీ తగ్గించి పూర్తిగా ఆ వ్యాపకం నుంచి బయటకు వచ్చేలా చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్