ఒకే తాటిపై నడిచేలా..

భార్యాభర్తల్లో ఒకరి నిర్ణయాన్ని ఇంకొకరు అంగీకరిస్తే ఆ దాంపత్యం సాఫీగా సాగిపోతుంది. కొందరు ఎదుటి వ్యక్తితో ఏకీభవించరు. ఎంత చిన్న విషయమైనా నా మాటే నెగ్గాలంటారు. ప్రతి దానికీ చిర్రుబుర్రులాడుతుంటారు.

Published : 22 Apr 2023 00:16 IST

భార్యాభర్తల్లో ఒకరి నిర్ణయాన్ని ఇంకొకరు అంగీకరిస్తే ఆ దాంపత్యం సాఫీగా సాగిపోతుంది. కొందరు ఎదుటి వ్యక్తితో ఏకీభవించరు. ఎంత చిన్న విషయమైనా నా మాటే నెగ్గాలంటారు. ప్రతి దానికీ చిర్రుబుర్రులాడుతుంటారు. అలా కాకుండా జీవితం సుఖంగా సాగాలంటే ఒకరు కాకపోతే మరొకరు అర్థం చేసుకోవాలి. అలా ఉండటానికి కొన్ని సలహాలిస్తున్నారు నిపుణులు...

* ఇంటికోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా బాగా ఆలోచించాలి. అది కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గమనించాలి. కుటుంబ సభ్యులందరికీ నచ్చేలా, ఉపయోగపడేలా ఉండాలి. ఏ ఒక్కరు మీ నిర్ణయం వల్ల నొచ్చుకున్నా, ఇబ్బంది పడినా భాగస్వామి ఆగ్రహానికి గురవుతారు. అలాగని అన్ని విషయాల్లో మీ ఇష్టాలను వదులుకోమని కాదు. దేన్నైనా ఒప్పించే ఓపిక మీకుండాలి.

* మీరు ఏం చెప్పినా అవతలి వారు అంగీకరించరనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఒక్కోసారి చెప్పకుండానే తోచింది చేసేస్తారు. అలా చేయటం మంచిది కాదు. భాగస్వామి నమ్మకాన్ని కోల్పోతారని గుర్తుంచుకోండి. విషయం ఏదైనా వారితో చర్చించండి. మీ నిజాయతీని మెచ్చి కూడా మీతో కలసి అడుగులేయొచ్చు కదా!

* నాకు అన్నీ తెలుసు అనే ధోరణి అస్సలు పనికిరాదు. అలా చేస్తే భార్యాభర్తలిద్దరూ సుఖంగా ఉండలేరు. ఎవరో ఒకరు అర్థం చేసుకొని సర్దుకుపోవాల్సిన దగ్గర పంతాలకు పోతే బంధం తెగిపోయే దాకా వస్తుంది. అంతవరకూ రాకుండా ముందే జాగ్రత్తపడాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్