పిల్లలకు మర్యాదలు చెప్తున్నారా..

పెద్ద వాళ్లతో పిల్లలు అమర్యాదగా మాట్లాడుతున్నారా? చిన్నపిల్లలు కదా వాళ్లే నేర్చుకుంటారులే అని మీరు వెనకేసుకొస్తున్నారేమో! అలా చేస్తే భవిష్యత్తులో సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు..

Published : 26 Apr 2023 00:43 IST

పెద్ద వాళ్లతో పిల్లలు అమర్యాదగా మాట్లాడుతున్నారా? చిన్నపిల్లలు కదా వాళ్లే నేర్చుకుంటారులే అని మీరు వెనకేసుకొస్తున్నారేమో! అలా చేస్తే భవిష్యత్తులో సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు..

* పిల్లలకు అమ్మగా మర్యాదలు మీరే చెప్పాలి. వాళ్లే తెలుసుకుంటారులే... అని మాత్రం వదిలేయకండి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ చిన్నతనం నుంచీ ఉన్న అలవాట్లను మార్చుకోలేరు. వారికి చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది. కానీ కోపంతో కాకుండా.. అర్థమయ్యేలా వివరించి చెప్పండి.

* వయసులో పెద్దవాళ్లతో అమర్యాదగా ప్రవర్తిస్తారు. అది సహజమే అనుకోకండి. వెంటనే క్షమాపణలు చెప్పించండి. మళ్లీ ఇలా చేయనని వారితో అనిపించండి. అప్పుడే ఆ సంఘటన గుర్తుండిపోయి ఇంకోసారి అలా చేయకుండా ఉంటారు.

* ఒక్కోసారి తప్పు చేసిన వెంటనే వారికి అర్థమైపోతుంది. పశ్చాత్తాప పడతారు కానీ దాన్ని అవతలి వారికి ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతారు. లోపలే మదన పడుతూ ఉంటారు. అలా కాకుండా పిల్లలకు చొరవ తీసుకోవటం నేర్పించండి.

* ఇంట్లోని పెద్దవాళ్లతో మీరు అమర్యాదగా మాట్లాడితే పిల్లలు అదే నేర్చుకుంటారు. అలాగే ప్రవర్తించాలేమో అనుకుంటారు, పాటిస్తారు. అందుకని వారి ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. మగపిల్లలైతే ఇంటా, బయటా అమ్మాయిలతో ఎలా మెలగాలో కూడా నేర్పండి. శారీరక వైకల్యాల గురించి హేళన చేయడం, వ్యక్తిగత అలవాట్ల గురించి వ్యాఖ్యలు చేయడం వంటివీ అలవాటు కాకుండా చూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్