ఆయనకో గ్రీటింగ్‌కార్డు

భాగస్వామిపై ఎనలేని ప్రేమ ఉంటుంది. కానీ కొందరు మాత్రం దాన్ని సరిగా వ్యక్తం చేయలేరు. ఒక్కోసారి ఇది అవతలివారిలో తీవ్ర అసంతృప్తికి కారణం అవుతుందంటారు నిపుణులు.

Published : 04 May 2023 00:13 IST

భాగస్వామిపై ఎనలేని ప్రేమ ఉంటుంది. కానీ కొందరు మాత్రం దాన్ని సరిగా వ్యక్తం చేయలేరు. ఒక్కోసారి ఇది అవతలివారిలో తీవ్ర అసంతృప్తికి కారణం అవుతుందంటారు నిపుణులు. వారి ప్రేమను తెలియజేసేందుకు కొన్ని మార్గాలూ సూచిస్తున్నారు.

* భాగస్వామి నుంచి పొగడ్త ఆశించని వారుండరు. రోజూ కాకపోయినా ప్రత్యేకమైన రోజుల్లో అయినా అంటే పెళ్లిరోజు, పుట్టిన రోజులప్పుడైనా ఒకరి మనసులోని ప్రేమను ఇంకొకరికి చెప్పుకోవాలి. వీలైతే ఇద్దరూ కలిసి ఏకాంత సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడే అసంతృప్తి, అభద్రత దూరమవుతాయి.

* అప్పుడప్పుడూ దూరం కూడా బంధాన్ని మరింత దగ్గర చేస్తుందంటారు. అలా ప్రయత్నించి చూడండి. ఒంటరిగా ట్రిప్‌కి ఎక్కడికైనా వెళ్లండి. లేక బంధువులు, స్నేహితులతోనో గడపండి. అప్పుడు మీ భాగస్వామి విలువ తెలుస్తుంది. తను ఈ సమయంలో నా పక్కన ఉంటే ఎంత బాగుండును అని తప్పకుండా అనిపిస్తుంది. తిరిగొచ్చిన వెంటనే వారిపై ఉన్న ప్రేమనంతా చెప్పేస్తారు.

* గ్రీటింగు కార్డులంటే పెళ్లికి ముందే ఇచ్చుకోవాలి. అవి ప్రేమికులే ఉపయోగిస్తారు.. అనే రూలేం లేదు. మీ భాగస్వామిపై మీకున్న ప్రేమనంతా ఓ గ్రీటింగ్‌ కార్డుపై రాసి ఇవ్వండి. అది చదివాక మీ ప్రేమకు దాసోహమైపోతారు. మీ దాంపత్యం మరింత సంతోషంగా సాగిపోయేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని