మనసు బాధ తగ్గించే మంత్రం

అంతా బావున్నట్టే అనిపిస్తుంటుంది... అంతలోనే కోరుకున్నంత ప్రేమ లేదనో, ఇదివరకటిలా శ్రద్ధపెట్టడం లేదనో  బాధ ఓ మూల తొలుస్తూ ఉంటుంది.  ఏ సంసారంలోనైనా ఇది సహజమే అయినా అది తీవ్ర రూపం దాల్చకూడదంటే...

Published : 08 May 2023 00:15 IST

అంతా బావున్నట్టే అనిపిస్తుంటుంది... అంతలోనే కోరుకున్నంత ప్రేమ లేదనో, ఇదివరకటిలా శ్రద్ధపెట్టడం లేదనో  బాధ ఓ మూల తొలుస్తూ ఉంటుంది.  ఏ సంసారంలోనైనా ఇది సహజమే అయినా అది తీవ్ర రూపం దాల్చకూడదంటే...

* నోరు తెరిచి చెప్పండి... ఎదుటివారు మన మనసుని ఇట్టే అర్థం చేసుకుంటారనేం లేదు! ఏదైనా సరే నోరుతెరిచి చెప్పితీరాల్సిందే. కాబట్టి మీ ప్రేమనే కాదు...మీ ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ పంచుకుంటేనే కలిసి సంతోషంగా నడవగలరు. అయితే, ఆ చెప్పే విషయాన్ని కాస్త సున్నితంగా చెప్పండి చాలు.

* అర్థం చేసుకోండి... ఇంటి బాధ్యతల్నీ, పిల్లల పెంపకాన్నీ చూసుకుంటూ సాగడం మీకు ఒకింత కష్టమే అయ్యి ఉండొచ్చు. అలాగే తక్కువ జీతంతో ఇంటిని ముందుకు నడపడం...మీ భాగస్వామి ఒత్తిడికి కారణం కావొచ్చు. ఒకరి సమస్యల్ని ఒకరు తెలుసుకుంటేనే కదా...అవి అర్థమయ్యేది! కాబట్టి, విషయమేదైనా పంచుకోండి. అప్పుడు మనసులోని అభద్రత, ఆందోళన తగ్గిపోతాయి.

* నియంత్రించొద్దు... ఒకరికోసం ఒకరు అన్నట్లు ప్రేమను వెలిబుచ్చడం దంపతులందరికీ చేతకాకపోవచ్చు. అయినంత మాత్రాన ఒకరంటే మరొకరికి ఇష్టం లేనట్లుకాదు. సంసారంలో దాపరికాలూ, మోసం చేసుకోవడాలూ ఉండకూడదు. ఈ పరిస్థితి ఎదుటివారిని బలవంతంగా నియంత్రించాలనుకోవడం, తమ చెప్పు చేతల్లో నడిపించాలనుకోవడం వల్లే ఏర్పడతాయని గుర్తించండి. వీలైనంత పారదర్శకంగా ఉండేలా చూసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్