ఆవేశం తగ్గితే ఆనందమే!

స్నేహితుల మధ్య సరదాలూ, సంతోషాలే కాదు... అలకలూ, రుసరుసలూ కూడా ఉంటాయి. ప్రతి గొడవకూ కారణాలను వెతకడం, ఎత్తిచూపడం పనిగా పెట్టుకుంటే మీ మధ్య దూరం మరింత పెరుగుతుంది. అలాకాకూడదంటే ఇలా చేయండి.

Published : 09 May 2023 00:27 IST

స్నేహితుల మధ్య సరదాలూ, సంతోషాలే కాదు... అలకలూ, రుసరుసలూ కూడా ఉంటాయి. ప్రతి గొడవకూ కారణాలను వెతకడం, ఎత్తిచూపడం పనిగా పెట్టుకుంటే మీ మధ్య దూరం మరింత పెరుగుతుంది. అలాకాకూడదంటే ఇలా చేయండి.

పోటీ అవసరమే!  పనిలో అయినా చదువులో అయినా పోటీ అవసరమే. అది స్నేహితుల మధ్య అయినా ఉండాల్సిందే.. కానీ ఆరోగ్యకరమైన పోటీ తప్పనిసరి. లేదంటే అసూయా, ద్వేషాలు మొదలవుతాయి. మీ స్నేహితురాలి ప్రతిభను మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. అప్పుడే అవతలివారూ అభినందిస్తారు. అది ఎదుగుదలనే కాదు.. మీ స్నేహబంధాన్ని కూడా పదిల పరుస్తుంది.

సూటిపోటి మాటలొద్దు... కొందరు తమ స్నేహబంధంలోకి ఇతరులు రావడాన్ని సహించలేరు. దాంతో తమ ఫ్రెండ్‌ వేరెవరితో మాట్లాడినా అలగడం, ఎత్తిపొడుస్తూ మాట్లాడటం చేస్తుంటారు. దీనివల్ల మీపై విరక్తి కలిగే అవకాశం ఉంది. అంతేకాదు, ఎంత మీ స్నేహితురాలే అయినా...ప్రతి విషయంలోనూ ఆమెను నియంత్రించాలని చూడటం వల్ల మీ బంధాన్నే ముగించాల్సిన పరిస్థితి రావొచ్చని మరిచిపోవద్దు. 

పారదర్శకంగా.. స్నేహితుల గొడవలు మామూలే అయినా వాటిని వీలైనంతవరకూ గోప్యంగానే ఉంచండి. మీ ఇద్దరి మధ్య మరికొందరూ చేరితే ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారుతుంది. దానికి అపోహలూ, అపార్థాలూ తోడవుతాయి. ఇంకా దూరం పెరుగుతుంది. మీ సమస్య మరింత జటిలమవుతుంది. వీలైనంతవరకూ గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు మీరే చొరవ తీసుకోండి. అయితే వెంటనే కాకపోయినా అవేశం కాస్త తగ్గాక ప్రయత్నిస్తే సమస్య సులువుగా పరిష్కారమవుతుంది.

మార్పు అవసరం... సమస్యకు మూలం మీ దగ్గరే ఉండొచ్చు. మీ స్నేహితురాలూ కారణం కావొచ్చు. కారణం ఏదైనా సరే మీరు మారాల్సిన అవసరం ఉందనుకుంటే! మొండి వాదనకు దిగొద్దు. అవసరమైన చోట తగ్గాల్సి రావొచ్చు. దానికి మీరు మానసికంగా సిద్ధం కండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్