ఖర్చు గురించీ చర్చించారా?

పెళ్లికి ముందే అబ్బాయితో ఇష్టాయిష్టాలు, అభిరుచులు వగైరా పంచుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు అమ్మాయిలు. ఆర్థిక విషయాలు, భవిష్యత్తు ప్లాన్‌ చేసేసుకుంటున్నారు.

Published : 11 May 2023 00:32 IST

పెళ్లికి ముందే అబ్బాయితో ఇష్టాయిష్టాలు, అభిరుచులు వగైరా పంచుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు అమ్మాయిలు. ఆర్థిక విషయాలు, భవిష్యత్తు ప్లాన్‌ చేసేసుకుంటున్నారు. మరి పెళ్లి ఖర్చు సంగతో? వివాహ సమయంలో విభేదాలకు దారితీసే ముఖ్య అంశాల్లో ఇదీ ఒకటి. అందుకే గురించీ ముందే చర్చించమంటున్నారు నిపుణులు.

* పెళ్లంటే మామూలు ఖర్చా? మధ్యతరగతి కుటుంబాలకు అది ఇప్పటికీ భారమే. మీ ఇంటి, అమ్మానాన్నల ఆర్థిక పరిస్థితి ఎలాగూ తెలిసే ఉంటుంది. కాబట్టి, దాన్ని దృష్టిలో ఉంచుకుని పెళ్లి ఖర్చును పంచుకునే విషయంపై అవతలి వారితో మాట్లాడండి. ఎవరు వేటిని చూసుకుంటారన్నది తెలిస్తే ప్రణాళిక వేసుకోవడం సులువవుతుంది.

* మన సంప్రదాయంలో పెట్టుపోతలకు ప్రాధాన్య మెక్కువ. ఏదైనా సంఖ్య తెలుసుకొని ఊరుకో వద్దు. మీ బడ్జెట్‌ అంచనా వేసుకొని, దానిలోనే తీసుకోగలమని ముందే చెప్పండి. ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో ముందుగానే తెలియజేసినా అనవసర విభేదాలకు చోటుండదు.

* ‘జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక.. ఘనంగా...’ అన్న ఆలోచనే చాలా మందిది. దీనికితోడు నయా ధోరణులను అనుసరించాలన్న కోరిక. మరి ఖర్చు? తడిసి మోపెడవుతుంది. అలాగని ఆశల్ని వదులుకోనవసరం లేదు. మరీ దగ్గరివారితో హల్దీ, కెమెరాతోనే ఫొటోషూట్‌లు.. ఇలా బోలెడు ప్లాన్‌ చేసుకోవచ్చు. ప్రాధమ్యాలను గుర్తించాలి, అవతలి వారినీ ‘సరే’ అనిపించాలంతే.

* అన్నింటిలోనూ సగం సగం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ‘నీకు సగం- నాకు సగం’ అని కాకుండా వేడుకలను పంచుకోండి. పెళ్లి ఒకరు చేస్తే ఇంకొకరు రిసెప్షన్‌.. ఇలా. ‘ఏమనుకుంటారో’ అని ఆలోచించొద్దు. వివాహమంటే ఇద్దరు మనుషులే కాదు.. రెండు కుటుంబాల కలయిక కూడా. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఇరు కుటుంబాల మధ్య అనుబంధం పెనవేసుకునేది. గొడవలు, భవిష్యత్‌ ఇబ్బందులకు తావివ్వొద్దంటే.. చర్చించడం మర్చిపోకండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్