సాన్నిహిత్యం ఉంటేనే దాంపత్యం..

కొత్తగా పెళ్లైన దంపతులకు ఒకరి గురించి ఒకరికి తెలుసుకునే సమయం ఉండకపోవచ్చు. అవతలి వ్యక్తి గురించి పూర్తిగా అర్థం చేసుకునే లోపులోనే వారు అసహనానికి గురవ్వచ్చు.

Published : 17 May 2023 00:25 IST

కొత్తగా పెళ్లైన దంపతులకు ఒకరి గురించి ఒకరికి తెలుసుకునే సమయం ఉండకపోవచ్చు. అవతలి వ్యక్తి గురించి పూర్తిగా అర్థం చేసుకునే లోపులోనే వారు అసహనానికి గురవ్వచ్చు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే...

స్నేహితులుగా...

భార్యాభర్తలుగా మెలిగే కంటే ముందుగా వారిద్దరి మధ్యా కనీసం స్నేహం అయినా ఉండాలి. ఏ బంధం లేకుండానే కేవలం వివాహమైందన్న ఒకే ఒక కారణంతో వారు బాధ్యతగా ప్రవర్తించాలని కోరుకోవటం సమంజసం కాదు. నాకోసం ఇదెందుకు చేయలేదని కోపానికి గురయ్యే ముందు అసలు మీ ఇష్టాయిష్టాల గురించి చర్చించుకున్నారా.. ఆలోచించండి. మీకేం కావాలో అవతలి వ్యక్తికి తెలియనప్పుడు మీకు కావల్సినట్లు నడుచుకోలేదని చిర్రుబుర్రులాడటం న్యాయం కాదు కదా! కాబట్టి పెళ్లైన కొత్తలో ఇరువురి మధ్య స్నేహం చిగురించేందుకు, ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన వచ్చేందుకైనా ఎక్కువ సమయం ఏకాంతంగా గడపాలి. స్నేహితులైన తర్వాతే ఏ బంధం అయినా చిగురిస్తుందని గుర్తుంచుకోండి..

పంచుకోండి..

ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక మీ మధ్య ఉండాల్సిన పరిధులు ఏంటో చర్చించుకోండి. ఎంత దంపతులైనా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది కదా.. ఇంటి గురించి చర్చించుకోవాల్సిన సమయం, సంతోషంగా వీకెండ్‌ ప్లాన్‌లు, ట్రిప్‌లు లాంటి వాటికి కేటాయించే సమయం గురించి మాట్లాడుకోండి. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే పని బాధ్యతలు పంచుకొంటే ఇరువురి మధ్య అనుబంధం ఇంకా బలపడుతుంది. చిన్న చిన్న తప్పిదాలు ఎవరు చేయరు చెప్పండి? కాబట్టి ఏదైనా జరిగితే దాని గురించి ఎక్కువగా పక్క వారిని నిందించటం మానేయండి. ప్రేమగా కష్టసుఖాలు పంచుకుంటే ఆ దాంపత్యం పది కాలాల పాటు పదిలమంటున్నారు నిపుణులు..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని