గొడవలకు చెక్ పెట్టేయండిలా
భార్యాభర్తల మధ్య జరిగే కొన్ని వాదనలు ఒక్కోసారి పెద్దవవుతూ ఉంటాయి. తమ అభిప్రాయాల్ని బయటపెడుతున్నాం అనుకుంటారు కానీ మాటలు పెరిగే కొద్దీ అది కాస్తా దారి తప్పుతుంది. అలాకాకుండా ఉండాలంటే...
భార్యాభర్తల మధ్య జరిగే కొన్ని వాదనలు ఒక్కోసారి పెద్దవవుతూ ఉంటాయి. తమ అభిప్రాయాల్ని బయటపెడుతున్నాం అనుకుంటారు కానీ మాటలు పెరిగే కొద్దీ అది కాస్తా దారి తప్పుతుంది. అలాకాకుండా ఉండాలంటే...
* ఇద్దరు మాట్లాడుకునేటప్పుడైనా, గొడవ పడేటప్పుడైనా ఏ అంశం గురించి మాట్లాడుతున్నాం అన్నదానిపై స్పష్టత ఉండాలి. విషయం గాడితప్పుతుంది అనిపిస్తే అక్కడితో ఆపేయడం మంచిది.
* ఎదుటివారు ఏం చెబుతున్నారో ముందు వినాలి. ఒకవేళ వారి ఆలోచనా విధానం తప్పైతే సున్నితంగా వివరించాలి.
* వాదనల్లో గత విషయాలను, తప్పులనూ ప్రస్తావిస్తారు. ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపినట్లు, కించపరచినట్లు ఉంటాయవి. గొడవ జరిగేటప్పుడు వాటిని గమనించరు. తర్వాత తప్పైందని ఆలోచించి బాధపడినా లాభం లేదు.
* పని ఒత్తిడి ఎక్కువైతే ఆ ప్రభావం తెలియకుండానే అవతలివారిపై చూపించేస్తుంటాం. ఎక్కడి విషయాలు అక్కడ వదిలేయాలి. లేదంటే చిన్నచిన్న కోపాలే చినికి చినికి గాలివానగా మారతాయి. మీరున్న పరిస్థితిని వివరించడం ద్వారా ఇలాంటి వాటినుంచి తప్పించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.