పెళ్లికి ముందే ఇలా...

మధు, సుధాకర్‌ల స్నేహం పెళ్లి వరకు వెళ్లింది. ఏడడుగులేయకముందే మాటలతో కించపరిచి బాధపెట్టడం, ఫోన్‌లో క్షణం ఆలస్యమైనా కోప్పడుతున్న సుధాకర్‌ని చూస్తే మధుకి ఆందోళన మొదలైంది.

Published : 07 Jun 2023 00:05 IST

మధు, సుధాకర్‌ల స్నేహం పెళ్లి వరకు వెళ్లింది. ఏడడుగులేయకముందే మాటలతో కించపరిచి బాధపెట్టడం, ఫోన్‌లో క్షణం ఆలస్యమైనా కోప్పడుతున్న సుధాకర్‌ని చూస్తే మధుకి ఆందోళన మొదలైంది. పెళ్లికాకముందే ఇలా ఉంటే దానికి కారణాన్ని గుర్తించాలి. లేదంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే...

* ప్రేమబంధాన్ని కొనసాగించాల్సిన బాధ్యత బంధంలో ఉన్న ఇరువురికీ ఉండాలి. అలాకాకుండా పెళ్లికాకముందే ఎదుటివారిలో తీవ్రమైన చెడు ప్రవర్తన కనిపిస్తే మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు... ఆ ‘టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌’కి గుడ్‌బై చెప్పడమే మంచిది.

* ప్రేమను ప్రదర్శిస్తూనే... మాటలతో కించపరచడం, అనుమానించడంతోపాటు మన భావోద్వేగాలను అవమానిస్తుంటే... కూర్చుని మాట్లాడండి. మీరెంతగా బాధపడుతున్నారో చెప్పండి. నమ్మకం లేని చోట అనుబంధాలకు విలువుండదని అర్థమయ్యేలా వివరించండి. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే... ఆ బంధానికి దూరంగా ఉండటమే మేలు.

* ప్రోత్సాహాన్ని అందించాల్సినప్పుడు నేనున్నాననే భరోసా ఇవ్వకుండా నిరుత్సాహపరచడం, లక్ష్యాలను నీరుగార్చి వెనక్కిలాగడానికి ప్రయత్నించే వ్యక్తిపై నమ్మకాన్ని పెంచుకోకూడదు. మరెవరితోనూ కలవనివ్వని అసూయ, ఒంటరిని చేయడం, అమర్యాద, అదుపులేని ఆవేశం, నియంత్రించడానికి ప్రయత్నించడం, భయపెట్టి దాడికి దిగడానికి కూడా వెనుకాడని వ్యక్తితో బంధాన్ని కొనసాగించకపోవడం తప్పేమీ కాదు. అయితే ఈక్రమంలో ఎదురయ్యే మనస్పర్థలూ, దాడులు చేసే విద్వేషం అవతలివారిలో కనిపిస్తే ఈ సమస్య పరిష్కరించుకోవడానికి తల్లిదండ్రుల సాయం తీసుకోండి. అప్పటికీ సాధ్యపడకపోతే పోలీసులను సంప్రదించడానికి వెనుకాడకండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని