పిల్లల్ని సిద్ధం చేస్తున్నారా?

వేసవి సెలవులు పూర్తికావొచ్చాయి. కొద్ది రోజుల్లో స్కూళ్లు తెరుచుకుంటాయి. ఇంకా సమయం ఉందని ఊరుకుంటున్నారా?

Published : 08 Jun 2023 00:11 IST

వేసవి సెలవులు పూర్తికావొచ్చాయి. కొద్ది రోజుల్లో స్కూళ్లు తెరుచుకుంటాయి. ఇంకా సమయం ఉందని ఊరుకుంటున్నారా?

* వేళలు.. పిల్లలు ఏ అర్ధరాత్రో పడుకోవడం, ఆలస్యంగా లేవడం చేస్తున్నారా? సెలవులేగా అని మనమూ చూసిచూడనట్లు ఊరుకుంటాం. ఒక్కసారిగా పొద్దున్నే లేచి, సిద్ధం కమ్మంటే ఇబ్బంది. కాబట్టి ఉదయాన్నే లేపడం మొదలు పెట్టండి. ఒకట్రెండు రోజులు కష్టపడ్డా.. తర్వాత అలవాటవుతుంది.

* మాట్లాడండి.. మళ్లీ స్కూలంటే ఒక్క సారిగా దిగాలు పడిపోతారు. చదువంటే భయమో, అనాసక్తో కారణమేదైనా పోగొట్టాల్సింది మనమే. కొత్త టీచర్లు, మారిపోయే స్నేహితులు వాళ్లని కలవర పెట్టొచ్చు. దానికీ సిద్ధం చేయండి. వాళ్లతో ఎలా మెలగాలో, నేర్చుకోవాలో చెబుతూ ఉంటే ఆసక్తిగా ఎదురు చూస్తారు.

* దూరం చేయాలి.. సెలవులంటే టీవీ, ఫోన్లతో అతుక్కుపోయే పిల్లలే ఎక్కువ. ఆ అలవాట్లకు నెమ్మదిగా కళ్లెం వేయండి. పాత పుస్తకాలు సర్దుకోవడం, రఫ్‌బుక్‌ తయారు చేసుకోవడం, పెన్నులు, పెన్సిళ్లు వంటివన్నీ సమకూర్చుకోవడం చేయమనండి.

* ఆ అలవాటు.. సెలవుల ప్రభావం ఆహార వేళలపైనా పడుతుంది. పది తర్వాత టిఫిన్‌, ఆలస్యంగా భోజనాలు అలవాటయ్యుంటాయి. చిప్స్‌, ఐస్‌క్రీమ్‌ వంటివి అడిగినా ఇచ్చేస్తుంటాం. చదువు కూడా శ్రమతో కూడుకున్నదే. బుర్రకీ శక్తి కావాలి. ఈ అలవాట్లన్నీ మాన్పించి, ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టిపెట్టండి. ఇలా ముందు నుంచీ చేస్తేనే మార్పుకి వాళ్లూ ఉక్కిరిబిక్కిరి కారు. మనకీ ఒత్తిడి ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్