శక్తిమంతమవుదాం

లక్ష్యాలను చేరుకోవాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢచిత్తంతో ఉండాలి. అది అందరికీ సాధ్యమవుతుందా అంటే ప్రశ్నార్థకమే. కొన్ని లక్షణాలను అలవరచుకుంటే అది సాధ్యమే అంటున్నారు నిపుణులు..

Updated : 09 Jun 2023 03:41 IST

లక్ష్యాలను చేరుకోవాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢచిత్తంతో ఉండాలి. అది అందరికీ సాధ్యమవుతుందా అంటే ప్రశ్నార్థకమే. కొన్ని లక్షణాలను అలవరచుకుంటే అది సాధ్యమే అంటున్నారు నిపుణులు..

ఆత్మస్థైర్యంతో.. ముందు మన బలాలు  తెలుసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న దాన్ని ఎంత కష్టమైనా సరే సాధించుకోవాలి. రాజీ పడి వచ్చిన దాంతో సరిపెట్టుకుంటే మనపై మనకే నమ్మకం తగ్గి ఆత్మవిశ్వాసమూ సన్నగిల్లుతుంది.
స్వేచ్ఛగా ఉంటేనే.. సొంత ఆసక్తులు, లక్ష్యాలు, ఏర్పరచుకోవాలి. అంతేతప్ప ఇతరుల సలహాతో లక్ష్యాలు మార్చుకోవద్దు. స్వేచ్ఛగా ఆలోచించ గలిగినప్పుడే దృఢంగా మారతాం.

గౌరవంగా... కొంతమంది తామే గొప్ప అనుకుంటూ ఇతరులను తక్కువగా చూస్తుంటారు. అటువంటివి సహించ కూడదు. మీ మనసు నొచ్చుకునేలా ఎవరైనా ప్రవర్తిస్తే సున్నితంగానైనా అది సరికాదని చెప్పేయండి. ఎందుకంటే, గౌరవం ఇచ్చి పుచ్చుకున్నప్పుడే మనల్ని మనం కోల్పోకుండా ఉంటాం.

భావోద్వేగాలు.. ఇవి అదుపులో ఉంటే చాలా సమస్యలను ముందుగానే అరికట్టవచ్చు. ఇతరుల మనోభావాలనూ అర్థం చేసుకోవాలి. అప్పుడే క్లిష్ట పరిస్థితుల్లోనూ పరిపక్వతతో నిర్ణయాలు తీసుకోగలం. శక్తిమంతంగా తయారవగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్