ఏం చెబుతున్నారో వినాలి..
కోపంలో చటుక్కున ఏదో ఒక మాటతో అవతలి వారిని బాధపెట్టడం చాలామందికి అలవాటు. దంపతుల్లోనూ ఇది ఉంటుంది. భేదాభిప్రాయం వచ్చినప్పుడు చర్చించుకోవాలి. అయితే అప్పుడు అవతలివారికి మాట్లాడే అవకాశమివ్వాలి.
కోపంలో చటుక్కున ఏదో ఒక మాటతో అవతలి వారిని బాధపెట్టడం చాలామందికి అలవాటు. దంపతుల్లోనూ ఇది ఉంటుంది. భేదాభిప్రాయం వచ్చినప్పుడు చర్చించుకోవాలి. అయితే అప్పుడు అవతలివారికి మాట్లాడే అవకాశమివ్వాలి. వాళ్లు చెప్పేది పూర్తిగా వినాలి. కానీ చాలా మంది భార్యాభర్తల వాదన ఒకే వైపున సాగుతుంది. అటువంటప్పుడు అపార్థాలు కొనసాగే ప్రమాదం ఉంది. దీన్ని నివారించాలంటే అవతలివారి అభిప్రాయాన్ని సానుకూలంగా వినే సహనం ఉండాలి. అప్పుడే వారిని అర్థం చేసుకోవచ్చు. దాంతో మీ ప్రతికూల అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. కోపం, దాంతో పాటు మీ మధ్య దూరమూ తగ్గుతుంది.
వినడంతో.. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడం ఒక కళ. ఇది భార్యాభర్తల్లో ఉన్నప్పుడు ఆ దాంపత్యంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. అవతలివారు చెప్పేది వినాలనుకోవడతో అహం దూరమవుతుంది. ఎదుటివారికి ఏమీ తెలియదని తక్కువ అంచనా వేస్తూ, వారు చెప్పేది వినడమేంటనే ఆలోచన ఆ ఇరువురి బంధాన్ని బలహీన పరుస్తుంది. అలాకాకుండా తాము చెప్పేది వినే భాగస్వామిపై గౌరవ మర్యాదలను పెంచుతుంది. తమ అభిప్రాయాన్ని విని అర్థం చేసుకున్నందుకు ప్రేమ పెరుగుతుంది. అప్పుడు పరిష్కారం దానంతటదే వస్తుంది. అలాగే అవతలివారి అభిప్రాయాన్ని మొక్కుబడిగా అడిగి, దాన్ని పట్టించుకోనట్లు ఉండకుండా, వారు చెప్పేది పూర్తిగా విని సమస్యను పరిష్కరించడానికి ఉపయోగిస్తే ఆ సంసారంలో ఎలాంటి కష్టమైనా దూదిపింజలా ఎగిరిపోతుంది. ఆ దాంపత్యం కలకాలం సంతోషంగా సాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.