అలాగే పెంచుతున్నారా..
రాధ పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతుంది. వారిని నీడలా వెంటాడదు. ఏం తింటే ఆరోగ్యకరమో వివరిస్తుంది. ప్రతి విషయంపై అవగాహన కలిగిస్తుంది. దీన్నే ‘ఎలిఫెంట్ పేరెంటింగ్’ అంటున్నారు నిపుణులు.
రాధ పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతుంది. వారిని నీడలా వెంటాడదు. ఏం తింటే ఆరోగ్యకరమో వివరిస్తుంది. ప్రతి విషయంపై అవగాహన కలిగిస్తుంది. దీన్నే ‘ఎలిఫెంట్ పేరెంటింగ్’ అంటున్నారు నిపుణులు. పిల్లలను సంరక్షిస్తూనే భవిష్యత్తుకు అవసరమైన పాఠాలనూ అందించే ఈ తరహా పెంపకం మంచి ఫలితాలిస్తోందని ఇటీవల పలు అధ్యయనాలూ తేల్చి చెప్పాయి.
చిన్నప్పటి నుంచి పిల్లల ఆలోచనలు, ఆశయాలను తల్లిదండ్రులు గుర్తించాలి. వారి మనసును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. పక్కింటివాళ్లు లేదా బంధువుల పిల్లలు క్రీడల్లో తమని తాము నిరూపించుకుంటున్నంత మాత్రాన మన పిల్లలూ అదే మార్గంలో అడుగులేయాలని లేదు. మన పిల్లల ఆలోచనలు తెలుసుకోవాలి. వారికిష్టమైన రంగంలో అడుగుపెట్టి సాధించాలనే ఆశయాలను నిరుత్సాహ పరచకూడదు. వారి అభిప్రాయానికి విలువ నివ్వకుండా, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోకుండా పెద్ద వాళ్లు చెప్పినదాన్నే పాటించాలనే నియంతృత్వధోరణి ప్రదర్శించకూడదు. కావాల్సిన మార్గాన్ని ఎంచుకొనే స్వేచ్ఛ, అవసరమైనప్పుడు ప్రోత్సాహాన్ని అందించగలిగితే చాలు. వారికిష్టమైన రంగంలో విజయాలు సాధించి చూపిస్తారు.
ఫలితాలెన్నో.. ఎలిఫెంట్ పేరెంటింగ్‌తో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సొంతంగా నిర్ణయం తీసుకోవడం మొదలుపెడతారు. అందులో ఎదురయ్యే కష్టాలను తెలుసుకుంటారు. వైఫల్యాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటారు. తల్లిదండ్రుల నుంచి పొందే అవగాహన వారిని ప్రతి విషయంలో ఆలోచించేలా చేస్తుంది. కొంచెం ప్రోత్సాహమందిస్తే చాలు. ధైర్యంగా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంటారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఛాలెంజ్‌గా తీసుకొని పరిష్కరించుకోగల సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంచుకుంటారు. ఇతరులకూ స్ఫూర్తిగా నిలుస్తారు. తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న విలువలను తమ పిల్లలకు అందించి అదే మార్గంలో పెంచడానికి ఆసక్తి చూపిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.