‘మాట సాయ’మే చాలు

నువ్వాదరినీ.. నేనీదరినీ అంటూ భార్యాభర్తలిద్దరూ చెరో చోట ఉద్యోగం చేసుకుంటూ బిజీగా గడిపేస్తున్నారు. కానీ సంపాదనలో పడి కలిసి గడిపే అందమైన క్షణాలని దూరం చేసుకోవాలా? అందుకే ఏమాత్రం తీరిక దొరికినా..

Updated : 21 Nov 2023 03:25 IST

నువ్వాదరినీ.. నేనీదరినీ అంటూ భార్యాభర్తలిద్దరూ చెరో చోట ఉద్యోగం చేసుకుంటూ బిజీగా గడిపేస్తున్నారు. కానీ సంపాదనలో పడి కలిసి గడిపే అందమైన క్షణాలని దూరం చేసుకోవాలా? అందుకే ఏమాత్రం తీరిక దొరికినా.. ఆ సమయాన్ని ఇలా అద్భుతంగా మలుచుకొనే ప్రయత్నం చేయండి..

  • మీ భాగస్వామి మీకు చిన్న సాయం చేసినా సరే థ్యాంక్స్‌ చెప్పండి. ఈమాత్రం దానికేనా అతికాకపోతే అనుకోవద్దు. అలా థ్యాంక్స్‌ చెప్పడం వల్ల వారు చేస్తున్న సాయాన్ని మీరు గుర్తిస్తున్నారని అర్థం అవుతుంది. పైగా మరో పనిలో సాయం చేయడానికి ఈ మాట ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్నింటికీ మించి మీపై మరింత ప్రేమ, గౌరవం పెరుగుతాయి. సంతోషాన్ని అందిస్తుంది. బదులుగా ‘నాతో చెప్పకుండా నీకు నచ్చినట్టు ఎందుకలా చేశావ్‌’ అంటూ విమర్శలు మొదలు పెట్టారా? అవతలివాళ్లు నెమ్మదిగా మీకు దూరమవుతారు. మనకెందుకొచ్చిందిలే.. నచ్చినట్టు చేసుకోనియ్‌ అనుకుంటారు.
  • ఆఫీసు ఒత్తిడి వెంటాడినప్పుడు.. ఇంట్లో సమయాన్ని మనస్ఫూర్తిగా గడపలేం. అది మన మొహంలో తెలుస్తూనే ఉంటుంది. మీ ఇద్దరిలో ఎవరు ఇలా కనిపించినా ‘ఏదైనా సమస్యా’ అని అడిగి తెలుసుకోండి. వీలైతే పరిష్కార మార్గాన్ని కలిసి ఆలోచించుకోవాలి. లేదూ కాసేపు అవతలివారికి తగినంత స్పేస్‌ ఇవ్వడమే మంచిది. అలా కాకుండా ‘అనుకున్నా ఆ పొరపాటు నీవల్లే జరిగి ఉంటుంది. ఏదీ  సరిగా చేయడం చేత కాదా నీకు’ అంటూ విమర్శలు గుప్పిస్తే ఇక మీతో వాళ్ల సమస్యని ఎప్పటికీ పంచుకోరు. దాంపత్యంలో ఇద్దరూ ఒకరికొకరు మాటసాయం చేసుకుంటే పదికాలాల పాటూ దాంపత్యం పదిలంగా ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని