బడికి బొమ్మతో..!

అక్కతో బడికెళతానంటూ మారాం చేసే బుజ్జాయిలు ప్రతి ఇంట్లో ఉంటారు. వీపుపై బ్యాగు తగిలించుకుంటే చాలు. బడికెళ్లినంతగా సంబరపడిపోతారు. ఇక ప్లేస్కూల్‌కెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం తమకిష్టమైన బొమ్మలనూ తీసుకెళతానని పేచీ పెడతారు. అదిగో... అటువంటి చిన్నారుల కోసమే ఈ ‘బ్యాక్‌ ప్యాక్‌’లు.  

Published : 02 Jun 2024 01:52 IST

అక్కతో బడికెళతానంటూ మారాం చేసే బుజ్జాయిలు ప్రతి ఇంట్లో ఉంటారు. వీపుపై బ్యాగు తగిలించుకుంటే చాలు. బడికెళ్లినంతగా సంబరపడిపోతారు. ఇక ప్లేస్కూల్‌కెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం తమకిష్టమైన బొమ్మలనూ తీసుకెళతానని పేచీ పెడతారు. అదిగో... అటువంటి చిన్నారుల కోసమే ఈ ‘బ్యాక్‌ ప్యాక్‌’లు.

బొమ్మలనూ ఉంచొచ్చు...

కుక్కపిల్ల, సింహం, డైనోసార్‌ బొమ్మలకు నచ్చిన పేరు పెట్టుకుని పిల్లలు వాటితో ఆడుకుంటుంటారు. తీరా ప్లేస్కూల్‌కు బయలుదేరేటప్పుడు ఆ బొమ్మను వదల్లేరు. తమతోపాటు బడికి తీసుకెళ్లాలని మొండికేస్తారు. అలాంటివారి కోసమే ఈ ‘యానిమల్‌ విండో’ బ్యాక్‌ ప్యాక్‌. దీనికి ఓవైపు స్ట్రాప్స్, రెండోవైపు మూడు నాలుగు బొమ్మలుంచేలా చిన్న గదుల్లాంటి రంధ్రాలుంటాయి. నచ్చిన బొమ్మలను వీటిలో ఉంచితే చాలు. అవి కూడా తమతోనే ఉన్నాయనే భావన పిల్లల్లో ఉంటుంది. అలాగే ఆకాశం, నక్షత్రాలు, రాకెట్, అంతరిక్షం, వ్యోమగామిలాంటి డిజైన్లతో బ్యాక్‌ప్యాక్‌లొస్తున్నాయి. పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడమే కాదు, ఇవి సృజనాత్మకతనూ పెంచుతాయి.

నచ్చినవన్నీ సర్దేయొచ్చు...

ఈ బ్యాక్‌ ప్యాక్‌కు చిన్నారులకు నచ్చే కుందేలు, కుక్కపిల్ల వంటి బొమ్మలను స్ట్రాప్‌తో అటాచ్‌ చేసే సౌకర్యం ఉంటుంది. దీంతోపాటు నీలి ఆకాశం, నక్షత్రాలు, ఇల్లు, తోట అంటూ పలురకాల ఊలు బొమ్మలూ బ్యాగుకు అతికించి ఉంటాయి. అలాగే డెనిమ్, శాటిన్‌ క్లాత్స్‌తో తయారవుతున్న కొన్ని బ్యాగులకు ఓవైపు బొమ్మను ఫిక్స్‌ చేయొచ్చు. దీనికోసం బెల్ట్‌లా స్ట్రాప్స్‌తో లేదా అరలాంటిది అటాచ్డ్‌గా ఉంటుంది. ఇందులో నచ్చిన బొమ్మను స్టఫ్‌ చేస్తే కదలకుండా కూర్చుంటుంది. ఉత్సాహంగా పరుగులుపెట్టి చటుక్కున కనిపించని పిల్లలను కనుసన్నల్లో ఉండేలా చేసే బ్యాగులు ఇప్పుడొస్తున్నాయి. చిన్నారి తగిలించుకున్న ఈ బ్యాగుకు వెనకవైపు అటాచ్డ్‌గా ఓ బెల్ట్‌ లేదా వైర్‌ ఉంటుంది. దీని రెండోకొసను పెద్దవాళ్లు తమ చేతికి తొడుక్కుంటే సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్