చులకన చేయొద్దు..!

సరళ, రఘువరన్‌ ఏదీ నింపాదిగా చర్చించుకోరు. ఎందుకంటే మాట్లాడుకోవడం ప్రారంభించిన నిమిషాల్లోనే దంపతులిద్దరూ ఒకరిపై మరొకరు కోపంతో రగిలిపోతారు. ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెడతారు. ఇటువంటి వాతావరణం కుటుంబ సంతోషాన్ని దూరం చేస్తుందంటున్నారు నిపుణులు.

Published : 03 Jun 2024 00:48 IST

సరళ, రఘువరన్‌ ఏదీ నింపాదిగా చర్చించుకోరు. ఎందుకంటే మాట్లాడుకోవడం ప్రారంభించిన నిమిషాల్లోనే దంపతులిద్దరూ ఒకరిపై మరొకరు కోపంతో రగిలిపోతారు. ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెడతారు. ఇటువంటి వాతావరణం కుటుంబ సంతోషాన్ని దూరం చేస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి...   

దుటివారితో మాట కలపడం ఓ కళ. అందులోనూ జీవిత భాగస్వామితో మరింత అపురూపంగా మాట్లాడాలి. అప్పుడే ఆ వైవాహికబంధం సాఫీగా సాగిపోతుంది. అలా జరగాలంటే ఎదుటివారికన్నా తామే ఎక్కువ, నాకే అన్నీ తెలుసనే ఆలోచన భార్యాభర్తల్లో ఎవరికీ ఉండకూడదు. లేదంటే భాగస్వామిపై చులకన భావం పెరుగుతుంది. అలాకాకుండా అవతలివారిలోని ప్రత్యేకతను గుర్తించి విలువనివ్వండి. ఇద్దరి మధ్యా అసమానతలకు చోటుండదు.

నియంత్రించుకోవాలి...

దంపతులు ఏదైనా విషయంపై చర్చించుకున్నప్పుడు... ఎదుటివారు చెప్పింది నచ్చకపోతే కోపాన్ని ప్రదర్శించొద్దు. కూల్‌గా ఆ సందర్భాన్ని డీల్‌ చేయడం నేర్చుకోవాలి. స్వీయ నియంత్రణ ఉండాలి. అవతలివారెందుకలా మాట్లాడుతున్నారని ఆలోచించాలి. ఇలా ఇరువురూ చేస్తే సమస్య తేలికవుతుంది. కోపానికీ తావుండదు.

మృదువైన మాటలతో...

ఏ విషయాన్నైనా చర్చించాలనుకున్నప్పుడు మృదువైన మాటలతోనే సంభాషణ కొనసాగించాలి. ఎదుటివారి అభిప్రాయానికి విలువనిస్తూ, వారు చెప్పేది పూర్తిగా వినాలి. ఆ తర్వాత మీ ఆలోచననీ మృదువుగా చెప్పగలగాలి. ఇది అవతలివారికి ఒత్తిడి కలిగించదు. పైగా ఒకరికొకరు సానుకూలంగా అభిప్రాయాలను పంచుకునే వాతావరణం ఏర్పడుతుంది. ఇక కోపాలకు తావేది?

అవతలివారి గురించి ఆలోచించి...

భార్యాభర్తల్లో ఏ ఒక్కరు కోపాన్ని ప్రదర్శించినా, ఎదుటివారు దాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. మీరు బాధపడుతూ కూర్చోక... భాగస్వామికి ఎలా అనిపించిందో అన్న కోణంలో ఆలోచించాలి. వారి స్థానంలో ఉండి ఆలోచించాలి. అవతలివారి మనసు అర్థమవడమే కాదు... సమస్యా తీరుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్