అరెరె... మర్చిపోయానే!

స్కూళ్లు మొదలయ్యాయి కదా! ఈ కొన్నిరోజుల్లో ‘అరెరె... మర్చిపోయానే’ అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాం? సెలవుల్లో పిల్లలు నచ్చిన సమయానికి లేవడం, తినడానికి అలవాటుపడి ఉంటారు. ఒక్కసారిగా ఉదయాన్నే లేచి బడికి వెళ్లడమంటే వాళ్లకీ ఇబ్బందే!

Published : 14 Jun 2024 01:21 IST

చలో స్కూల్‌...

స్కూళ్లు మొదలయ్యాయి కదా! ఈ కొన్నిరోజుల్లో ‘అరెరె... మర్చిపోయానే’ అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాం? సెలవుల్లో పిల్లలు నచ్చిన సమయానికి లేవడం, తినడానికి అలవాటుపడి ఉంటారు. ఒక్కసారిగా ఉదయాన్నే లేచి బడికి వెళ్లడమంటే వాళ్లకీ ఇబ్బందే! వెంటపడితే కానీ చకాచకా కదలరు. ఇటు వీళ్లకి అన్నీ గుర్తుచేస్తూ, టిఫిన్, లంచ్‌ వంటివన్నీ అమరుస్తూ... ఒకరకంగా మనం పరుగులే తీస్తాం. ఇన్నీ చేసీ ఏదో ఒకటి మర్చిపోతాం. వీటికి చెక్‌ పెట్టేవే ఈ ‘కోర్‌ ఛార్ట్‌’లు. మరీ చిన్న పిల్లలనుకోండి. రోజువారీ చేయించాల్సినవన్నీ వీటిలో జాబితాగా పెట్టుకోవచ్చు. పూర్తవగానే టిక్‌ పెట్టేసుకుంటే సరిపోతుంది. చదవడం, రాయడం వచ్చిన పిల్లలనుకోండి. వాళ్లనే ఆ పనిచేయమంటే సరి. బ్రష్‌ దగ్గర్నుంచి పుస్తకాలు సర్దుకోవడం, హోమ్‌వర్క్, వేళకి నిద్ర... అన్నింటికీ వీటిలో చోటు కల్పించొచ్చు. కొన్నింటికి రోజూ సక్రమంగా పనులన్నీ పూర్తిచేస్తే మార్కులు ఇచ్చే వీలూ ఉంటుంది. వాటి ఆధారంగా వారాంతంలో గిఫ్ట్‌ ఉంటుందని చెప్పండి. రోజూ ఉత్సాహంగా చేసేస్తారు. ఇప్పుడంటే సరే... రోజులు గడిచేకొద్దీ కొత్త టాస్క్‌లు పెరుగుతాయి కదా అంటారా? ఏముంది... వీటన్నింటినీ సులభంగా తుడిచేసుకుని, కొత్తవి చేర్చుకోవడమే... అలాగే తయారయ్యాయి మరికొన్ని ఛార్ట్‌లు! బాగున్నాయి కదూ... కావాలనిపిస్తే ఈ కోర్‌ ఛార్ట్‌ల కోసం వెతికేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్