బంధాన్ని సమన్వయం చేయాలి..!

రమణికి ప్రేమించే భర్త దొరికాడు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా ఒత్తిడికి గురై, ఆ ప్రభావాన్ని భర్తపై చూపిస్తుంది. దీనికి వ్యక్తిగత మానసికారోగ్యం కాపాడుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 15 Jun 2024 01:39 IST

రమణికి ప్రేమించే భర్త దొరికాడు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా ఒత్తిడికి గురై, ఆ ప్రభావాన్ని భర్తపై చూపిస్తుంది. దీనికి వ్యక్తిగత మానసికారోగ్యం కాపాడుకోవాలంటున్నారు నిపుణులు.

జీవితంలో బంధాలను పెంపొందించుకుంటూ ఆరోగ్యకరమైన మానసికస్థితిని కొనసాగించడం ఓ సవాల్‌. మనసులో కలిగే ఆలోచనలు, అనుభూతులు, భావోద్వేగాలు మన ప్రవర్తనను ప్రభావితం చే స్తాయి. దీన్ని అధిగమించాలంటే మనసు ఎప్పుడు  ఎందుకు ట్రిగ్గర్‌ అవుతుందో స్వయంగా గుర్తించాలి. ఒత్తిడి, ఆందోళనసహా నిరాశ కలిగేటప్పుడు ఆ సంకేతాలను కనిపెట్టి నివారించాలి.

ఆరోగ్యకరంగా...

ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. వ్యాయామం, సమతులాహారం, తగినంత నిద్ర మానసికారోగ్యాన్ని పెంపొందిస్తాయి. వ్యాయామం ద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్‌లు సహజ మూడ్‌ లిఫ్టర్స్‌గా పనిచేస్తాయి. అలాగే పోషకాహారం మెదడును ఆరోగ్యంగా, ధ్యానం, యోగావంటివి భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. అలాగే మానసికారోగ్యానికి సంబంధించి భాగస్వామితో పంచుకుని సాయాన్ని కోరాలి. దంపతులిద్దరూ కలిసి నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే మద్దతు, ప్రేమ, గౌరవం ఆ దాంపత్యబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్