ఆ గజిబిజి ఉండదిక!

చిన్న తరగతులకు పలక, బలపం ఉంటే చాలు... ఒకప్పటి పరిస్థితి ఇది. మరి ఇప్పుడో? అక్షరం దిద్దడం రాకపోయినా బోలెడు సరంజామా. క్రేయాన్స్, కలర్‌ పెన్సిల్స్, క్రాఫ్ట్‌ మెటీరియల్‌... వీటితోనే బ్యాగు నిండిపోతుంది.

Published : 15 Jun 2024 01:42 IST

చలో స్కూల్‌

చిన్న తరగతులకు పలక, బలపం ఉంటే చాలు... ఒకప్పటి పరిస్థితి ఇది. మరి ఇప్పుడో? అక్షరం దిద్దడం రాకపోయినా బోలెడు సరంజామా. క్రేయాన్స్, కలర్‌ పెన్సిల్స్, క్రాఫ్ట్‌ మెటీరియల్‌... వీటితోనే బ్యాగు నిండిపోతుంది. వాటికి ప్రత్యేకంగా ఓ చిన్న బాక్సో, పౌచ్‌నో ఏర్పాటు చేయాలి. స్కూల్లో పని పూర్తయ్యాక వాటిని సర్దుకోవడమూ పిల్లలకు కాస్త ఇబ్బందే. ఈ ‘పెన్సిల్‌ కేస్‌ విత్‌ కంపార్ట్‌మెంట్స్‌’ లేదా ‘స్టేషనరీ స్టోరేజ్‌ బ్యాగ్‌’లను ప్రయత్నించండి. వీటిలో రోజువారీగా అవసరమయ్యే పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్‌ వంటివి పెట్టడానికే కాదు కలర్‌ పెన్సిల్స్, క్రేయాన్స్, స్కెచ్‌లు వగైరా పెట్టుకోవడానికీ విడివిడిగా అమరికలున్నాయి. ఒకటి తీస్తే మిగతావి పడిపోతాయన్న భయం ఉండదు. పిల్లలకు నచ్చే బొమ్మలు, పెయింటింగ్‌లతో చిన్నారులను ఆకర్షించేలానూ వస్తున్నాయి. వాళ్ల అభిరుచికి తగ్గది ఎంపిక చేస్తే సరి. చక్కగా వాళ్లే సర్దుకుంటారు. మనకీ ఎక్కడ మర్చిపోతారోనన్న కంగారూ ఉండదు. బాగున్నాయి కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్