మొరాయించక... రాస్తారిక!

కొందరు అమ్మలకు... చిన్నపిల్లలను స్కూలుకు వేళకి పంపడం ఎంత కష్టమో... వాళ్లతో రాయించడం అంతకన్నా కష్టం. ‘సరిగా రాయి, ఇక్కడ తప్పు... మళ్లీ చెరిపి రాయి’ అని పదే పదే అంటామనే వాళ్ల భయం మరి.

Published : 17 Jun 2024 01:24 IST

కొందరు అమ్మలకు... చిన్నపిల్లలను స్కూలుకు వేళకి పంపడం ఎంత కష్టమో... వాళ్లతో రాయించడం అంతకన్నా కష్టం. ‘సరిగా రాయి, ఇక్కడ తప్పు... మళ్లీ చెరిపి రాయి’ అని పదే పదే అంటామనే వాళ్ల భయం మరి. అందుకే నోటితో వల్లె వేయడానికి ఎంతైనా ఇష్టపడతారు కానీ... పెన్సిల్‌ చేత పట్టుకోవడానికే మొరాయిస్తారు. వాళ్లతో సరదాగా రాయించాలా? ఈ ‘పెన్సిల్‌ క్యాప్స్‌’ మీకు సాయపడతాయి. యూనికార్న్, పక్షులు, జంతువులు, పూలు... వాళ్ల మనసును దోచేవేవో కనిపెట్టి కొనేస్తే సరి! వాటిని చూస్తూ మురిసిపోతూ... వాటికి సంబంధించి కథలు అల్లుతూ మరీ రాసేస్తారు. అదో ఖర్చు దండగ అనిపిస్తోందా? పిల్లలు రాయడం పూర్తయ్యాక పెన్సిళ్లను బ్యాగులోనో, కంపాస్‌ బాక్సులోనో, పౌచ్‌లోనో పడేస్తారుగా! బ్యాగు, పౌచ్‌లైతే పెన్సిల్‌ మొన కారణంగా రంధ్రాలు పడతాయి. బాక్సు అయితే రాసుకుపోయి నల్లగా మారుతుంది. ఈ క్యాపులు వెనక పెడితే పెన్సిల్‌కి అందం తెస్తాయి. రాయడం పూర్తయ్యాక ముందు పెట్టేస్తే ఈ చిక్కులను తొలగిస్తాయి. అలానూ లాభమేగా... కాబట్టి, ప్రయత్నించండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్