పిల్లలను ప్రశ్నిస్తున్నారా..!

ఇల్లు, ఆఫీసు, పిల్లల స్కూల్‌ పనులతో రోజంతా బిజీగా ఉంటాం. అయితే రాత్రి నిద్రపోయే ముందు పిల్లల కోసం కేటాయించిన సమయంలో ఆ రోజు గురించి ప్రశ్నించాలంటున్నారు నిపుణులు. దాంతో వాళ్ల ఆలోచనాతీరును గుర్తించొచ్చు అని చెబుతున్నారు. 

Published : 18 Jun 2024 01:11 IST

ఇల్లు, ఆఫీసు, పిల్లల స్కూల్‌ పనులతో రోజంతా బిజీగా ఉంటాం. అయితే రాత్రి నిద్రపోయే ముందు పిల్లల కోసం కేటాయించిన సమయంలో ఆ రోజు గురించి ప్రశ్నించాలంటున్నారు నిపుణులు. దాంతో వాళ్ల ఆలోచనాతీరును గుర్తించొచ్చు అని చెబుతున్నారు. 

  • పిల్లల జీవితంపై ఆ రోజు ఎటువంటి ప్రభావాన్ని చూపిందో అడగాలి. ఇది వాళ్ల ఆలోచనలు, భావోద్వేగాలను బయటపడేలా చేస్తుంది. వాళ్ల అవసరాలూ గుర్తించొచ్చు. అలాగే ఆ రోజులో ప్రత్యేకంగా అనిపించిన విషయమేదో అడగాలి. సానుకూల అంశాలతో పాటు ప్రతికూలంగా అనిపించినవీ చెప్పమనాలి. వీటినిబట్టి పిల్లల మానసికస్థితిని అంచనా వేయొచ్చు.
  • వారిని బాధపెట్టిన విషయాన్ని అడగాలి. ఎదుటివారివల్ల వారు పడుతున్న ఇబ్బందులతోపాటు వాళ్లలోని భావోద్వేగ మేధస్సునూ గుర్తించొచ్చు. చుట్టూ ఉన్న వ్యక్తులను వారెలా అర్థం చేసుకోగలుగుతున్నారో తెలుసుకోవచ్చు. అలాగే పిల్లల సమస్యలను పరిష్కరిస్తే, తమకంటూ తల్లిదండ్రులు తోడున్నారనే భరోసా, నమ్మకం వాళ్లలో కలుగుతుంది. మనసులోని విషయాలను అమ్మానాన్నతో స్వేచ్ఛగా చెప్పడం అలవరుచుకుంటారు.
  • ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారేమో అడగాలి. వాళ్లు చెప్పేది పూర్తిగా వినాలి. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నందుకు ప్రశంసించాలి. ఇది వారిని మరిన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంచుతుంది.
  • ఏదైనా విషయం ఆ రోజు పిల్లలకు ఛాలెంజ్‌గా అనిపించిందేమో ప్రశ్నించాలి. దాన్ని సవాల్‌గా తీసుకొని ఎలా దాటొచ్చనేది సలహా ఇవ్వాలి. సమస్య ఎదురైతే ధైర్యంగా నిలబడగలుగుతారు.
  • కొత్త స్నేహితులతో పరిచయాలు, చదివిన పుస్తకం గురించి లేదా వాళ్లకు ఆరోజు నచ్చిన సంభాషణ వంటివన్నీ పిల్లలతో కబుర్లు చెబుతూనే తెలుసుకోవచ్చు. స్నేహం విలువ, ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకోవడం ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవచ్చని తెలుసుకుంటారు. గడిచిన రోజు ఎంత విలువైందో, అలాగే మరుసటి రోజుకు మరింత ప్రాముఖ్యత ఇవ్వడమెంత ముఖ్యమో నేర్చుకుంటారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్