మురిపెంగా... దాచుకునేలా!

స్కూలంటే ఎంతసేపూ చదువేనా? ఆ బుజ్జి మెదళ్ల సృజనాత్మకతను బయటపెట్టే వేదిక కూడా. చదువు బోర్‌ కొట్టించొద్దనో... ప్రత్యేక రోజులను పరిచయం చేయాలనో... డ్రాయింగ్, క్రాఫ్ట్, క్విజ్‌లంటూ బోలెడు పోటీలు పెడతారుగా! మధ్యమధ్యలో వచ్చే స్లిప్‌ టెస్ట్‌లూ సరేసరి.

Published : 23 Jun 2024 01:15 IST

చలో స్కూల్‌

స్కూలంటే ఎంతసేపూ చదువేనా? ఆ బుజ్జి మెదళ్ల సృజనాత్మకతను బయటపెట్టే వేదిక కూడా. చదువు బోర్‌ కొట్టించొద్దనో... ప్రత్యేక రోజులను పరిచయం చేయాలనో... డ్రాయింగ్, క్రాఫ్ట్, క్విజ్‌లంటూ బోలెడు పోటీలు పెడతారుగా! మధ్యమధ్యలో వచ్చే స్లిప్‌ టెస్ట్‌లూ సరేసరి. తరవాత చూసుకోవాలనుకున్నా, పరీక్షలప్పుడు సాయపడతాయనుకున్నా భద్రంగా దాచుకోవాలిగా మరి? ఎంతసేపూ మనమే దాస్తే వాటి విలువ వాళ్లకి తెలిసేదెలా? ఈ ఫోల్డర్‌లను కొనివ్వండి. వాళ్లే జాగ్రత్తగా అందులో పెట్టేస్తారు. చిరగడం, పాడవడం లాంటివీ ఉండవు. వాళ్లకి నచ్చే డిజైన్లు, బొమ్మలతో ఉన్నవి కొనిస్తే సరి. కొన్నింటిని పేర్లతోనూ డిజైన్‌ చేయించుకోవచ్చు. మీ చిన్నారులకు నచ్చినవేంటో వెదికేయండి మరి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్