ధైర్యంగా... తీసుకెళ్తారిక!

పెద్ద చదువులు చదివినా... ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడినా నెలసరి విషయంలో తడబడేవారే ఎక్కువ. ఇంట్లోనే శానిటరీ న్యాప్కిన్‌ని టవల్‌ మాటున తీసుకెళుతుంటారు. ఇక ఆఫీసుల్లో మార్చుకోవాల్సి వస్తే పేపర్లు, కర్చీఫులు, పర్సుల సాయం తప్పనిసరి.

Published : 25 Jun 2024 01:22 IST

చలో స్కూల్‌

పెద్ద చదువులు చదివినా... ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడినా నెలసరి విషయంలో తడబడేవారే ఎక్కువ. ఇంట్లోనే శానిటరీ న్యాప్కిన్‌ని టవల్‌ మాటున తీసుకెళుతుంటారు. ఇక ఆఫీసుల్లో మార్చుకోవాల్సి వస్తే పేపర్లు, కర్చీఫులు, పర్సుల సాయం తప్పనిసరి. పెద్దవాళ్లకే ఇలా ఉంటే... స్కూలుకెళ్లే పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు? అలాగని శానిటరీ ప్యాడ్‌ మార్చుకోకపోతేనేమో అనారోగ్యాల బారిన పడాలి. అందుకే ఈ ప్యాడ్‌ లేదా శానిటరీ న్యాప్కిన్‌ పౌచ్‌లను తెచ్చేయండి. సైజును బట్టి అయిదు వరకూ ప్యాడ్‌లను ఉంచొచ్చు. చిన్నపాటి పర్సుల్లానే ఉంటాయి. బరువూ ఉండవు, తీసుకెళ్లడమూ తేలిక. కాబట్టి, అమ్మాయిలూ ఇబ్బంది పడరు. ముందుగానే బ్యాగులో పెట్టేసి ఉంచితే నెలసరి ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉంటారు. ‘ప్యాడ్‌ లేదు, చాలాసేపు మార్చుకోలేదు’ అన్న బెంగ ఉండదు. ఎలా తీసుకెళ్లాలన్న కంగారూ అవసరం లేదు. చక్కగా చదువుపైనే దృష్టిపెడతారు. బాగున్నాయి కదూ... ఇంకేం ఒకటి తెచ్చి అమ్మాయి బ్యాగులో ఉంచితే సరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్