పనిలో ఉన్నా... ప్రేమగా!

‘బిజీ’ ఎంత చిన్న పదం! కానీ ఇద్దరి మధ్యా దూరానికి కారణమయ్యే ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటంటే నమ్ముతారా? భార్యాభర్తలిద్దరూ సంపాదించక తప్పని రోజులివి.

Published : 30 Jun 2024 01:57 IST

‘బిజీ’ ఎంత చిన్న పదం! కానీ ఇద్దరి మధ్యా దూరానికి కారణమయ్యే ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటంటే నమ్ముతారా? భార్యాభర్తలిద్దరూ సంపాదించక తప్పని రోజులివి. అలాగని పనిలోనే మునిగి తేలితే ప్రేమించిన వారు దూరమవుతారు. అలా కావొద్దంటే...

ద్దరికీ రోజంతా పనితోనే సరిపోతుంది. క్షణం తీరిక దొరకదు అనే అనుకుందాం. సాయంత్రం కాసేపైనా మాట్లాడుకునే వీలు ఉంటుందిగా! ఆ సమయం భాగస్వామితో గడపండి. పనులు, ఆఫీసు, బంధువులు, స్నేహితుల సంగతులు అన్నీ పక్కన పెట్టేయండి. మీకు సంబంధించినవే మాట్లాడుకోండి. ఫోన్, టీవీల జోలికీ వెళ్లొద్దు. ఒకరు మాట్లాడుతోంటే మరొకరు శ్రద్ధగా వినాలి. ఇది ఇద్దరి మధ్యా అన్యోన్యతను పెంచుతుంది. 

మనిషి ఎంత దూరంగా ఉన్నా... టెక్నాలజీ మనసుల్ని దగ్గర చేస్తోంది కదా! దాని సాయం తీసుకోండి. ఒక సమయం పెట్టుకోండి. వాయిస్‌ లేదా వీడియో కాల్‌లో తప్పక మాట్లాడుకోండి. కాస్త ఖాళీ దొరికినప్పుడు ‘తిన్నావా? ఈరోజు చాలా పనుంది, నువ్వెలా ఉన్నావ్‌’ ఇలా చిన్నదైనా మెసేజ్‌ లేదా వాయిస్‌ మెసేజ్‌ పంపండి. ఓ పువ్వు, మొక్క, పెయింటింగ్, భవనం... ఆరోజు చూసినవాటిల్లో ఏది నచ్చినా ఫొటోలు, చిన్న వీడియోల రూపంలో పంచుకోండి. ప్రతిక్షణం తన గురించి ఆలోచిస్తున్నారన్న భావన ఎదుటివారికి ఎంత భరోసానిస్తుందో! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్