తెలివితేటల్లో... ఇరుగూపొరుగూ!

మనం ఎప్పుడైనా ఇల్లు మారాలనుకున్నప్పుడు ఇరుగూ పొరుగూ చూసుకోవాలని పెద్దవాళ్లు చెబుతుంటారు కదా! అందుకు కారణమేదైనా... తాజాగా బోస్టన్‌ మెడికల్‌ సెంటర్‌ చేసిన పరిశోధనలు మాత్రం ఆ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

Published : 04 Jul 2024 02:04 IST

మనం ఎప్పుడైనా ఇల్లు మారాలనుకున్నప్పుడు ఇరుగూ పొరుగూ చూసుకోవాలని పెద్దవాళ్లు చెబుతుంటారు కదా! అందుకు కారణమేదైనా... తాజాగా బోస్టన్‌ మెడికల్‌ సెంటర్‌ చేసిన పరిశోధనలు మాత్రం ఆ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మన చుట్టూ ఉండే వాతావరణం పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపిస్తుందట. అందులోనూ చదువుకున్నవాళ్లు మన పక్కింట్లో ఉంటే...  పిల్లల్లో భాషా నైపుణ్యాలతోపాటు కాగ్నిటివ్‌ సామర్థ్యాలూ పెరుగుతాయట. ఆ మార్పు వారిలో శిశువుగా ఉన్నప్పటినుంచే మొదలవుతుందట. అందుకోసం పరిశోధకులు బోస్టన్, లాస్‌ ఏంజెలెస్‌ ప్రాంతాల్లోని 65మంది శిశువులపై ప్రయోగం చేశారట. ఇందుకు రకరకాల వాతావరణాల్లో పెరిగే 6నుంచి 12నెలల పిల్లల్ని ఎంచుకున్నారు. ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రఫీ (ఈఈజీ) ద్వారా వారి మెదడు పనితీరును క్షుణ్ణంగా పరీక్షించారట. పిల్లల్లో కాగ్నిటివ్‌ డెవలప్‌మెంట్‌ను ముల్లెన్‌ స్కేల్స్‌ ఆఫ్‌ ఎర్లీ లెర్నింగ్‌(ఎమ్‌ఎస్‌ఈఎల్‌) విధానంలో... అంటే రకరకాల ఆటల ద్వారా, అంచనా వేశారు. చుట్టూ చదువుకున్న వ్యక్తులు ఉంటే, ఆ పిల్లల్లో మెదడు పనితీరు మెరుగ్గా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఎందుకంటే వాళ్ల నుంచి చిన్నారులు నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మనం నివసించే ప్రదేశాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్