పక్క తడిపే అలవాటును ఇలా మాన్పించాం..!

‘చిన్నపిల్లల చేత డైపర్లు మాన్పించి... రాత్రుళ్లూ పక్క తడపకుండా ఉండేలా చేయడం కష్టమే.  దీన్ని సులువుగా నేర్పించిన వారిలో కొందరి అనుసరణీయ చిట్కాలివీ.

Updated : 06 Jul 2024 15:11 IST

‘చిన్నపిల్లల చేత డైపర్లు మాన్పించి... రాత్రుళ్లూ పక్క తడపకుండా ఉండేలా చేయడం కష్టమే.  దీన్ని సులువుగా నేర్పించిన వారిలో కొందరి అనుసరణీయ చిట్కాలివీ.


రెండు గంటలకోసారి తీసుకెళ్లి...

మా బాబుకి పది నెలలు వచ్చినప్పటి నుంచీ పగలు ప్రతి రెండు గంటలకోసారి బాత్రూమ్‌కి తీసుకెళ్లేవాళ్లం. వాడు మూత్రం పోసేవరకూ ఎంతసేపైనా అలాగే పట్టుకొని ఉండేవాళ్లం. రాత్రి కూడా నిద్రపోయే ముందు, మధ్యలో ఒకసారి లేపి పోయించేవాళ్లం. అలా మూడు, నాలుగు నెలలు అయ్యేసరికి మూత్రం వస్తే బాత్రూమ్‌లోకి వెళ్లాలని అర్థమైంది. ఆ తరవాతి నుంచి వాడెప్పుడూ పక్క తడపలేదు.

శిరీష, హైదరాబాద్‌


‘సు.. సు..’ అని...

మా బాబుకి రాత్రుళ్లు మాత్రమే డైపర్‌ వేసేవాళ్లం. అదీ ఏడాది వరకే! వాడికి నాలుగు నెలల వయసు నుంచే మా అమ్మ ఈ శిక్షణ ప్రారంభించింది. వాడు లేవగానే బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి... ‘సు... సు...’ అని నోటితో శబ్దం వచ్చేలా చేసేది. అది విన్న వెంటనే వాడు మూత్రం పోసేవాడు. నేనూ తరవాత అదే కొనసాగించా. నడక వచ్చే నాటికి వాడే బాత్రూమ్‌లోకి వెళ్లిపోయేవాడు. రాత్రుళ్లు మాత్రం మధ్యలో ఒకసారి లేపి పోయించేదాన్ని. తరవాత డైపర్‌ వేయాల్సిన అవసరం నాకిక రాలేదు.

జయలలిత, శ్రీకాకుళం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్