పొదుపుతోపాటు దాతృత్వం కూడా..!

పిల్లలకిచ్చే మొత్తం పాకెట్‌మనీని సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నారా. అయితే ఈ కిడ్డీబ్యాంకులు కొనివ్వండి. ఇవైతే పొదుపుతోపాటు నలుగురికీ సాయపడటాన్నీ నేరిస్తాయి.

Published : 07 Jul 2024 02:10 IST

పిల్లలకిచ్చే మొత్తం పాకెట్‌మనీని సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నారా. అయితే ఈ కిడ్డీబ్యాంకులు కొనివ్వండి. ఇవైతే పొదుపుతోపాటు నలుగురికీ సాయపడటాన్నీ నేరిస్తాయి.

బాల్యం నుంచే పొదుపు చేయడం నేర్పిస్తే భవిష్యత్తులో వారికి ఆర్థిక ప్రణాళిక అలవడుతుంది. చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టకుండా, కొంతైనా పొదుపు చేయడంవల్ల అత్యవసరానికి ఉపయోగపడుతుందని అర్థమవుతుంది. అలాగే తమవద్ద ఉన్నదాంట్లో కొంతైనా పేద పిల్లలకు, అనాథలకు అందించడం చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తే వాళ్లలో దయాగుణం పెరుగుతుంది. ఈ లక్షణాలు పిల్లలకు రావాలంటే ప్రత్యేకంగా వస్తున్న ఈ కిడ్డీ బ్యాంకులను అందించండి. వీటిని రకరకాల రంగుల్లో జంతువుల ఆకారాల్లో పిల్లలను ఆకర్షించేలా తయారుచేస్తున్నారు. వీటిలో విడివిడిగా ఉన్న అరలపై పొదుపు, దానం, ఖర్చు అంటూ ప్రింట్‌ చేసి ఉంటుంది. వీటన్నింటిలోనూ తమ వద్ద ఉన్న నగదును సమానంగా వేయడం నేర్పితే చాలు. చిన్నారులకు క్రమేపీ ఇదొక అలవాటుగా మారుతుంది.

 

ఖాళీ సీసాలతో... ఇంట్లోనే

మార్కెట్‌లో దొరుకుతున్నవే కొనాలనేం లేదు. వీటిని ఇంట్లోనూ తయారుచేసి పిల్లలకు అందించొచ్చు. ఒకే ఆకారం, పరిమాణంలో ఉన్న మూడు ఖాళీ సీసాలు తీసుకొని సేవింగ్స్, టాయ్స్, డొనేషన్‌ అని రాసి వాటికి అంటించాలి. హోం మేడ్‌ కిడ్డీ బ్యాంకులు సిద్ధమవుతాయి. ఖాళీ పౌడర్, కూల్‌డ్రింక్‌ డబ్బాలకు స్టిక్కర్లు అంటించినా చాలు. వీటిని పిల్లలతోనూ సరదాగా సెలవురోజుల్లో తయారు చేయించొచ్చు. మరింకెందుకు ఆలస్యం? మీ బుజ్జాయిలకూ పొదుపు అలవాటు చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్