ఆరేసుకోలేక... కనిపెట్టింది!

ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి ఆలియా ఓరాకి వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడలేని ఇబ్బంది. ఎందుకంటే.. వానకి తడిచిన షూలని ఎండబెట్టుకోవడం పెద్ద ప్రహసనం. దానికి తోడు తేమ అధికంగా ఉండే ముంబయిలో... షూలు ఓ పట్టాన ఆరవు. ఒకవేళ ఆరినా పచ్చిగానే ఉండేవి. దాంతో విపరీతమైన దుర్వాసన. తర్వాత రోజు మ్యాచ్‌కి వాటితోనే ఆడాలి. దాంతో కొన్నిసార్లు చర్మవ్యాధులు కూడా వచ్చేవి. ఇది తన సమస్యే కాదు...

Published : 12 Jun 2021 01:17 IST

ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి ఆలియా ఓరాకి వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడలేని ఇబ్బంది. ఎందుకంటే.. వానకి తడిచిన షూలని ఎండబెట్టుకోవడం పెద్ద ప్రహసనం. దానికి తోడు తేమ అధికంగా ఉండే ముంబయిలో... షూలు ఓ పట్టాన ఆరవు. ఒకవేళ ఆరినా పచ్చిగానే ఉండేవి. దాంతో విపరీతమైన దుర్వాసన. తర్వాత రోజు మ్యాచ్‌కి వాటితోనే ఆడాలి. దాంతో కొన్నిసార్లు చర్మవ్యాధులు కూడా వచ్చేవి. ఇది తన సమస్యే కాదు... స్నేహితురాళ్లందరిదీ అని తెలిశాక ఏదోక పరిష్కారం చూడాలనుకుంది. ముంబయిలోని హిల్‌స్ప్రింగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతోన్న ఈ అమ్మాయి బూట్లని ఆరబెట్టేందుకు ‘సిలీడ్రై’ అనే డ్రైయింగ్‌ ఏజెంట్‌ని కనిపెట్టింది. చిన్నగా షాంపూ పాకెట్లలా ఉండే సిలీడ్రై ప్యాకెట్లు తేమ, తడిని పీల్చుకుని ఫంగస్‌ కారణంగా వచ్చే చర్మవ్యాధుల్ని నివారిస్తాయట. ‘ ప్యాకెట్ల మీద లోగోల రంగు మారేంత వరకూ వాటిని వాడొచ్చు. ఆ తర్వాతా పారేయక్కర్లేదు. చాకులు, ఇనుప పరికరాల దగ్గర ఉంచి... తుప్పుని అరికట్టవచ్చు, అల్మారాలో పెట్టుకుంటే ముక్క వాసన రాదు. ఎలక్ట్రానిక్‌ వస్తువుల మధ్యన ఉంచితే తేమ కారణంగా పాడవ్వకుండా ఉంటాయి’ అనే ఆలియా ఆడర్‌గో అనే మరో ఆవిష్కరణ కూడా చేసింది. ఈ ఆడర్‌-గోని రిఫ్రిజిరేటర్లు, స్నానాలగదులు, చెత్తబుట్టల్లో ఉంచితే దుర్వాసన ఉండదట. రెండు నెలల వరకూ వీటిని వాడుకోవచ్చు. వీటి ఖరీదు ఎనభై నుంచి వంద రూపాయల మధ్యలో ఉంది. ఆలియా తల్లి దుస్తుల వ్యాపారం చేస్తుంటారు. అవి పాడవకుండా ఉండేందుకు ఆమె కొన్ని చిట్కాలు పాటించేవారు. అలా వచ్చిందే ఈ ఆలోచనట. ఈ అమ్మాయి సోషల్‌ మీడియా సాయంతో అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఇందుకు సంబంధించిన ఉత్పాదన పనులన్నీ పేద మహిళలకు అప్పగించి వారికీ ఉపాధి కల్పిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్